Friday, August 12, 2011
అంతులేని ఆప్యాయతను పంచావు ఓ ప్రియతమా..!!!
బాధలకే నిలయం అయిన నా హృదయ అలజడిలో
ప్రేమ సవ్వడిని నింపావు నా ప్రాణమా...!!!
బంధమే దూరం అయిన నా జీవితం లో
అంతులేని ఆప్యాయతను పంచావు ఓ ప్రియతమా..!!!
బరువే అని నా గుండెను నిట్టుర్పులో వుంచాను
నీ ప్రేమ లో కొత్త హృదయాన్ని పరిచయం చేసి నన్ను నీవుగా మార్చావు …..
కారనాలెన్నైనా ఉండొచ్చు షడన్ గా మారావు నాకు దూర అయ్యావు..
అప్పుడు మొదలైన అలజడి గుండేల్లో తీరని ఆవేదని మిగిల్చింది..
ఎందుకిలా అని అడుగలేను అడిగే అర్హతలేదేమో అని..
ఎమౌతుందో తెలీదు...మొత్తానికి ఏదో జరుగుతుంది..
నీవు దూరం అయినప్పటినుంచి ...నా జీవితకాలం తగ్గిపోతుంది..
క్షనాలు ,నిమిషాలు ,ఘడియలు లెక్కపెట్టుకుంటున్నా..
ఇక నిన్ను చూస్తాను అన్న నమ్మకం తగ్గిపోతుంది..
నీకు నేను కనిపించనేమో శాశ్వితంగా ..అదేగా నీవూ కోరుకొనేది..
ఆ నీ కోరిక తీరాలని మనసా వాచా కర్మాణా కోరుకుంటున్నా..
Labels:
కవితలు