Thursday, August 25, 2011
ఎంత కాలమెంత కాలం.... వెల్లువెత్తే జ్ఞాపకాలతో కదిలిపోతూ
ఎంత కాలమెంత కాలం....
వెల్లువెత్తే జ్ఞాపకాలతో కదిలిపోతూ,
కలవరిస్తూ, తల్లడిల్లుతూ,
అలమటిస్తూ బాధ మనసును కోతకోస్తూ ...
కన్నీటి సుడులలో మునిగితేల్తూ కుమిలిపోతూ,
ఖిన్నమవుతూ బరువు బ్రతుకును భరిస్తూ ...
దహించు గురుతులు సహిస్తూ
నిలుచున్నపాటున నీరైపోతూ నివురైపోయే క్షణాలకోసం తపిస్తూ
నిలువలేనీయని మనసుతో ప్రతీక్షిస్తూ నిలపలేని కనుల బరువుతో నిరీక్షిస్తూ ఎంతకాలమెంతకాలం....
ఇంకెంత కాలమెంతెంతకాలం......
కాలంతో పోటీ పడలేక నీజ్ఞాపకాలు మరువలేక నిరాశగా వున్నా..
మనిషిలోని మనసుతో జరుగుతున్న నిజాలను ఒప్పుకోలేక..
వస్తున్న కన్నీటికి కారనం చెప్పుకోలేక..నిజం నుంచి తప్పుకోలేక మదన పడుతున్నా
నేను ..నీవు.. ఒకటి అన్న వాస్తవం ఎందుకు అబద్దం అయిందాని...?
Labels:
కవితలు