Monday, August 15, 2011
రక్తపు మడుగులో తడిసిన ఈ తెల్ల గులాబియే నేను నికిచ్చే ప్రేమ కానుక..
నిన్ను చూసిన ఆనాటి క్షణమది,
నా హృదయ వీణపై మ్రోగిన రాగం ఏనాడు మరవదు నా మది,
ఆ రాగంలో దాగిన ప్రేమయోగం నన్ను వరించింది,
వరమైన ప్రేమ నా ఉపిరిలో చేరింది,
నా ఉపిరిలో దాగిన నీ ప్రేమ రూపం దీపమయ్యింది,
ఆ దీపపు కాంతిలో నీ రూపం చిత్రమై నా కనులను చేరింది,
కన్నుల్లో దాగిన నీ రూపం నా కలల్లోకి జారి నా మనసును కలవరపరిచింది,
కలత చెందినా నా మనసు ప్రతిక్షణం నిన్ను చూడాలని తపించింది,
తపనతో తల్లడిల్లిన నా హృదయ గవాక్షం నుండి ప్రేమ సందేశం పావురమై ఎగిరిపోయింది,
ఎగిరిపోయిన నా ప్రేమపావురం నీ జ్ఞాపకాల మేఘాలను దాటుకుంటూ నీ గుండె గూటిని చేరింది,
కాని, నీ హృదయం ఓ పసిడి పంజరం, అందులో నా ప్రేమ పావురం బందీ అయ్యింది,
నాకు బదులేమీ రాకపోయింది,
నీ జాబు కోసం వేచి చుస్తూ విసిగిన నా హృదయం వేయి ముక్కలయ్యింది,
ఆ రక్తపు మడుగులో తడిసిన ఈ తెల్ల గులాబియే నేను నికిచ్చే ప్రేమ కానుక..తీసుకో
Labels:
కవితలు