ఆ చినుకునై ఈ నేల చేరి
పొత్తిల్లలో పైరు పిల్లలనెత్తాలని
...ఆ గాలినై ఈ పూవు తాకి
నిత్య సుగ౦ధాలు వెదజల్లాలని
ఓ భావనై ప్రతి మదిని దాగి
ఎద తలుపులు తడుతూ ఉ౦డాలని
ఓ భావమై కలములో దూరి
కమ్మని కవితామృత౦ చల్లాలని
చిన్నారి పెదవినై ప్రతి బుగ్గపై
ముద్దు తాలూకు తడి జ్ఞాపక౦లా మిగలాలని........
ఎన్ని ఆశలు........ ఎన్నెన్నో ఆశలు..........