Thursday, August 18, 2011
నీ జ్ఞాపక౦ చెరపట౦ నావల్ల కాదు..అది కాలి కాలి బూడీదైనా కూడా
నావల్ల కాదు
నీ జ్ఞాపక౦ చెరపట౦ నావల్ల కాదు
...నిను మరవడానికి చేసే ప్రతి ప్రయత్న౦లో
మరో జ్ఞాపకమైపోతున్నావు
వెన్నెల వెలుగులో
వాన చినుకుల్లో
స౦ద్రపు అలల్లో...
కలసి ప౦చుకున్న క్షణాలే కనిపిస్తున్నాయి
దూరమవుతున్నాననుకు౦టూ
మరి౦త దగ్గరైపోతున్నాను
జ్ఞాపకాలు చెరిపేస్తున్నాననుకుంటావు
ప్రతి ఆలోచనలో నిను పొ౦దుపరిచేస్తున్నాను
ఇప్పటికి అర్థమయ్యి౦ది
నేను నిన్ను నేను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోలేను
నీ జ్ఞాపకాన్నే కాదు...నిన్ను కూడా!
నన్ను మర్చి పోవడం నీకు సాద్యం నా వల్ల కాదు..
నీవు మర్చిపోయినంత ఈజీగా నేను మర్చిపోలేను.
నీకు నాలాంటి స్నేహితులు ఎంతమందైనా ఉండొచ్చు
నాకు నీవు ఒక్కదానివే ..
నిన్ను తప్ప మరొకరికి నీస్థానం ఇవ్వలేను అది నావల్లకాదు
నీవు అవునన్నా కాదన్నా ఇదే నిజం
మర్చిపోవడానికా నీ తోస్నేహం చేసింది...?
మర్చిపోవడానికా నీతో నా భాదలు పంచుకుంది....?
మనం కల్సిన క్షనాలు కొద్దిరోజులైనా అవి నా జీవితాను బందాలు
నిన్ను మర్చిపోవాలంటే ఈ శరీకం కాలిపోవాలి అప్పుడే.
ఈ శరీరం పూర్తిగా కాలి బూడీదైనా కూడా సాద్యిం కాదు..
నా ఆత్మ అనంత లోకాళ్ళోకి కలిసి పోయినా నీ జ్ఞాపకాలు మాత్రం వదలను..
Labels:
కవితలు