ఆకాశమంత ఆప్యాయతను చూపించావు;
చివరకు అంధకారం మిగిల్చి వెళ్ళిపోయావు;
తొలకరి చిరుజల్లులా చేరువయ్యావు;
కల్లోల కడలిలా అలజడి రేపి వెళ్ళిపోయావు;
కడదాక తోడుంటా నన్నావు;
కన్నీటి రుచి చూపించావు;
నేను లేకుండా నువ్వు సుఖంగా ఉంటానను కుంటున్నావు;
కాని ఏదో ఒక రోజు నువ్వు తెలుసు కుంటావు,
నా అంత ప్రేమ నీకు ఎక్కడా దొరకదని, నన్ను నిజంగా కోల్పోయానని