Friday, August 26, 2011
అన్నీ చింద్రం అయ్యాయి ..ఎందుకిలా జరిగింది జరుగుతుంది..?
ప్రేమ రెండు అక్షరాలే కానీ ,
ముడిపడటానికి రెండు క్షణాలే కానీ ,
రెండు హృదయాల మద్యీ కానీ ,
ఎన్నో ఎన్నో ఆశల తోరణాలు .....
ఎన్నో అనుకున్నాం బాసలు చేసుకున్నాం.
బందంగా మారక మునుపే ఇద్దరి మద్యి తెలియని అఘాదం..
ఎన్నో ఎన్నో రంగు కలల మెరుపులు .......
అన్నీ చింద్రం అయ్యాయి ..ఎందుకిలా జరిగింది జరుగుతుంది..
నా ప్రేమలో నిజాయితీ లేదా..నా స్నేహం వాస్తం కాదా..?
నాకు నేనుగా వేసుకున్న ఏ ప్రశ్నకు సమాదానం దొరకలేదు.
నిన్నూ అడగాలని ఉంది కాని అడగలేను..ఎందుకంటే నీవు మాట్లాడవుగా..
అలాగని నిన్ను వెంటపడి వేదిస్తూ ఎందుకిలా చేశావని అడుగలేను..?
నామనస్సాక్షిని చంపుకొని నిన్ను భాద పెట్టడం నావల్లకాదు..?
నీ చిన్న ఎడబాటు కూడా భరించలేని ఈ హృదయానికి చెంత చేర్చలేనీ హడ్డులేలా ?
ప్రేమ ఎవ్వరిని ఎప్పుడు తాకుతుందో ,
ఏ తీరాల చెంత చేర్చుతుందో తెలియదు కానీ ...చిగురించిన వేళ....
విడిపోయే ప్రతి క్షణం ఎంత నరకం .....
కలవలేని ప్రతి సమయం ఎంత వేదనభారితం ....
ఎవ్వరు ఏమి చెయ్యలేని విధిని .....
ఎదురించలేని ఈ అసహయతని ....
ఒప్పుకోలేని ఈ నా హృదయానీ .....
ఏమి చేయ్యాలి...
నీ ఉహల కన్నీలలో తడపడం తప్ప ఏం చేయగలను ప్రియతమా ....
Labels:
కవితలు