Thursday, August 18, 2011
ఏంజరుగుతుంది..మనసులో అలజడి..
ఏంజరుగుతుంది ..మనసులో అలజడి..కారనం వెతుక్కున్నా అర్దంకావడంలేదు..ఎవ్వరు ఏంటి ఎందుకు అని ప్రశ్నించుకుంటే మిగిలింది ప్రశ్నలే కాని అస్సలు సమాదానం దొరకడంలేదు..నాకు నేనే ఓ ప్రశ్నగా మిగిలిపోయాను నీ విషయంలో ..నిన్ను తప్పు పట్టను తప్పుపట్టేంత స్నేహం లేదిప్పుడు మనమద్యి నీవే కాదని వెళ్ళిపోయావు..సో ఏం చెప్పుకోలేను చెప్పినా వినే స్థితిలోలేవు..ఎందుకో నన్ను బాగా పిరికి వాడిగా మార్చావు ఒకప్పుడు నేను ఇలా లేను ..ఏవిషయం అయినా దైర్యంగా చెప్పే వాన్ని ...నీ పరిచయంతరువాత జరిగిన సంగటనలు నన్ను పిరికివాన్ని చేశాయి....నా ప్రమేయంలేకుండా నన్నే దోషిని చేస్తున్న ఘటనలు చూస్తుంటే నోట మాటరాక అలాగే చూస్తుండిపోయాను..ఇలా ఆలోచిస్తుంటే పెద్దగా అరవాలని పిస్తుంది..ఎవ్వరిమీద కోపమో తెలీదు..ఎవ్వరిమీద ఉంటుంది చెప్పు ఎవ్వరిని అంటే ఎవ్వరు పడతారు అందుకే నామీద నాకే కోపం..నామీదనాకే చిరాకు , నామీద నాకు కోపం నామీద నాకు అసహ్యిం వేస్తుంది..కొన్ని సమయాల్లో నీవు నన్ను డైరెక్టుగా అన్న మాటలు విన్నప్పుడు ఎందుకో చాలా భాదవేసేది అవి గుర్తుకు వచ్చినప్పుడల్లా కూడా కాని నేనూ ఏం అనలేను కదా...ఎప్పుడూ లైఫ్ లో ఇంతగా ఇలా భాదపడ్డ సందర్బం అస్సలేలేదు... అస్సలు నీకు గుర్తుకు వస్తానా అని పిస్తుంది ఒక్కోసారి...ఏమో గుర్తుకు వస్తే కనీసం ఎలావున్నావు అని పలుకరించేదానివి ..కాని ఒక్కసారిగూడా అలా చెయ్యలేదు...ఎప్పుడన్నా నేను పలుకరించాలని చూసినప్పుడు నాకాల్ చూసి నీవు ఫోన్ లిఫ్ట్ చేయక పోవడాన్ని చూస్తుంటే నేనంటే ఇంకా నీమనస్సులో నేనంటే చిరాకు కోపం అని అర్దం అయింది..ఆందుకే ఆప్రయత్నం చేద్దామని ఎన్నో సార్లు అనుకొని కూడా విరమించుకున్నా...చివరికి తట్టుకోలేకనీతో మాట్లాడాలనిపించి ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేసినప్పుడు నీవు లిప్ట్ చేసినా నేను అని చెప్పేదైర్యంలేక నీ గొంతువిని అలాగే ఫోన్ పెట్టేసేవాడిని..నేను అని చెబితే ఫోన్ చేయొద్దు అంటావు లేదా మాట్లాడకుండా పెట్టేస్తే ఆభాద తట్టుకోలేను అందుకే అలా...ఇలా ఎందుకు చేస్తున్నానో అర్దం కావడంలేదు..అప్పుడు అలా ఇప్పుడిలా అని తల్చుకుంటే నిజంగా ఏంటో ఎంచెప్పాలో అర్దంకావడంలేదు...నివు ఇలా వుంటున్నావంటే నమ్మాలని లేదుకాని ఇది ఇజం అస్సలు నీ క్యారెక్టర్ కాదు ఇలా ఉండవు నీ ప్రాంక్ నెస్..నీలో ఆధైర్యం చూసే నిన్ను ఇష్టపడ్డా కాణి ఎందుకు ఇలా మారావో తెలీదు అప్పుడు ఉన్నస్నేహంలో తేడా ఏం వచ్చింది..తప్పు నాదే అయివుంటుంది కదా..?నేను మంచి వాన్ని కాదు కాబట్టే నీ డెషిషన్ మార్చుకున్నావు నాకు దూరం అయ్యావు..ఇప్పుడున్న స్నేహితుల తో పోలిస్తే నేను నీ స్నేహానికి పనికి రాను కదా ఒకప్పుడు ఉదయాన్నే మీ గుడ్ మార్నిగ్ మెస్సేజ్ వచ్చేది అది ఇప్పుడు లేదంటే మెస్సేంజ్ లిష్టులోంచి నన్ను డిలీట్ చేశావు...కదా..?అందరికీ పంపి నాకు పంపడంలేదంటే నన్ను డిలీట్ చేశావు ..వాళ్ళ స్నేహంతో పోల్చుకుంటే నేను వేష్టు అని డిసైడ్ చేసుకున్నావు కదా..?అవును నీవే కరెక్టు నీవు ఏది చేసినా కరెక్టుగా ఆలోచిస్తావు..కరెక్టుగా చేస్తవు అని ఇప్పటికీ నమ్ముతా నిజమే నాలాంటీ వాళ్ళగురించి ఆలోచించి నీ టైం ఎందుకు వేష్టుచేసుకుంటావు.. కదా....?ఇలా ఎవేవో ఆలోచిస్తూ ఉంటాను ఆలోచించి ఏం లాభం నీతో షేర్ చేసుకోలేను చెప్పుకోలేను ..చెప్పుకుందాం అంటే వినేంత దగ్గరగా మన మనస్సులు లేవు వినేందుకు నీవు అస్సలు సిద్దంగా లేవు వినాల్సిన అవసరం నీకు లేదు ఎందుకంటే Who am i
Labels:
జరిగిన కధలు