Saturday, August 20, 2011
నీఎద తలుపులు తడుతూ ఉ౦డాలని...కోరడం తప్పా
ఆ చినుకునై ఈ నేల చేరి
పొత్తిల్లలో పైరు పిల్లలనెత్తాలని
...ఆ గాలినై ఈ పూవు తాకి
నిత్య సుగ౦ధాలు వెదజల్లాలని
ఓ భావనై ప్రతి మదిని దాగి
ఎద తలుపులు తడుతూ ఉ౦డాలని
అని నేను మాత్రమే అనుకుంటే సరిపోతుందా
ఓ భావమై కలములో చేరి
కమ్మని కవితామృత౦ చల్లాలని
చిన్నారి పెదవినై ప్రతి బుగ్గపై
ముద్దు తాలూకు తడి జ్ఞాపక౦లా మిగలాలని........
అన్నీ నిజాలని నిజంకావాలని కోరుకున్నాను..
జరగాలన్నవి జరుగకుండా ఎవేవో జరుగుతున్నాయి
అందుకే మనసు విరిగి ..చలించిన మనస్సుతో
ఆశలు తీరక మనస్సు చావక..గతాన్ని తలచుకొంటూ
విరహ వేదనతో వేడినిట్టూర్పులిస్తూ..నేనేమైపోతున్నానో అర్దకాక..
చావుబ్రతుకుల మద్యి కొట్టుమిట్టాడుతున్న ప్రానిలా ఇలా జీవచ్చవంలా ఉన్నా
Labels:
కవితలు