Tuesday, August 16, 2011
తప్పు ప్రపంచానిదా ప్రపంచంలో ఉన్న మనస్సులేని మనుషులదా..?
అక్షర సత్యాలు ఆచరణ సాద్యిం కాకపోయినా అద్బుతంగా ఉంటాయి
మనస్సుకు నచ్చకపోయినా మనస్సు పొరల్లో దాగిన నిజాల్లా..
కొన్ని నిజాలు అబద్దాలైన వేళ మనస్సులొ మరణ మృదంగాలు పలుకుతున్న వేళ
అక్షరాలూ అర్ధం కాని మనసులు చూడు ....ముత్యాల్లా మెరుస్తున్నయ్ ............
ప్రపంచమంతా న్యాయ నిర్ణేతల మయం...............
నువ్వు పుట్టింది న్యాయనిర్ణేతల ఆమోదం పొందడానికి కాదు ...........
నువ్వో స్వేచ్చ జీవివి ప్రతి శ్వాస ని స్వేచ్చగా తీసుకో .............
నీకు నేను ఉన్నాను .......నేను లేకపోయినా నువ్వు ఉండు ....అదే జీవితం
ఛీ కొట్టేంత అసహ్యంగా కనపడుతుందా ప్రపంచం ...........
తప్పు ప్రపంచానిదా పపంచంలో ఉన్న మనస్సులేని మనుషులదా..?
ఇంకా ఏదో తెలుసుకోవాలని వుందా ....నిజం గ వుందా ..........
అయితే నీకు వివేకానందుని నేత్రం అవసరం .........
సత్యం ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపిస్తుంది సత్యం ...........
అక్షరసత్యాలైనా కొన్ని చెప్పేందుకే కొన్ని వినేందుకేనా ప్రియతమా
ఒకప్పుడు నిజంగా ఉన్న నేను ఇప్పుడు అబద్దంగా మారానెందుకు..
కాలం మహిమ అని మనస్సుకు అర్ది చెప్పుకోనా కావాలని చేశావని భాదపడనా
Labels:
కవితలు