Friday, August 19, 2011
నీ జ్ఞాపకాల ధుఖ: సాగరంలో కన్నీటి కెరటాలను మిగిల్చావు.
అదే కదా కడదాక నా నిస్వార్తపు నేస్తం
చిరునవ్వుమోముతో నా జతలో రంగుల సింగిడీవవుతావనుకున్న
చిధ్రమయ్యెలా నా బ్రతుకుకు స్వాగత తోరణమయ్యావు.
నీ నిస్వార్తపు జల్లులతో కుసుమాల బృందావనాన్ని వరంగా ఇస్తావనుకున్న,
నిషబ్దంగా నాలో జారుతున్నా కన్నీటి జడివానకు మేఘసందేశానివయ్యావు.
ఆరారు కాలాల వర్ణాలతో నా మన: పరిసర ప్రకృతిని పరవశింప చేస్తావనుకున్న,
నీ జ్ఞాపకాల ధుఖ: సాగరంలో కన్నీటి కెరటాలను మిగిల్చావు.
నా వాత్సళ్యపు చిగురుల్లో ప్రతి నిత్యం వసంత కోకిలవవుతావనుకున్న,
నీ ఎడబాటులో బ్రతుకే భారామయ్యేలా విషాద గీతాలను వినిపిస్తున్నావు.
నీ మనసు వెన్నెల కాంతిలో నా ఆశల విరులు నీ సిగలో పూయించాలనుకున్న,
ఓటమి అడుగు జాడలలో నడిపిస్తావనుకోలేదు ప్రియా....
నీ ప్రేమను విడిచిన నాకు ఒంటరితనమే నా సహాగమనం అదే కదా కడదాక నిస్వార్తపు నా నేస్తం.
Labels:
కవితలు