Wednesday, December 15, 2010
మానవ సంబందాల పై ఓ అమ్మాయితో చేసిన ఇంటర్వూ part-2
నేను:-> నీ లవర్ కు నీ ...( నీకేరెక్టర్ మీద )బాయి ప్రెండ్ మీద అనుమానం ఉంటే..ఇద్దరిని ఒకే సారి నిలబెట్టి నీ కేరెక్టర్ గురించి అడగాలనుకున్నాడనుకో అప్పుడు ఏమి చేస్తావు
అమె:-> (చాలా కోపంగా ) వాడు ఎవడైనా కావచ్చు ఎన్ని సంత్సరాల పరిచయం కావచ్చు "చెప్పు తెగుద్ది అంటాను" కొట్టి చూపిస్తాను వాడెవడు నాప్రెండ్స్ ఎదురు నాకేరెక్టర్ అడగటానికి
నేను:-> నీ బాయి ప్రెండ్ నీప్రెండ్స్ నీగురించి చెడ్డగా అసభ్యింగా మాట్లాడుతున్నారు అని లవర్ చెబితే నమ్ముతారా
ఆమె:-> నమ్మను నమ్మకం లేనప్పుడు స్నేహం ఎందుకు చేస్తాను ...అలా చెప్పింది లవర్ అయినా నమ్మను.నీ పని నీవుచూసుకో నాపర్సనల్ విషయాల్లో తలదూర్చకు అని వార్నింగ్ ఇస్తాను.నా ప్రెండ్స్ పైన నాకానమ్మకం ఉంది లేకపోతే ఎందుకు స్నేహం చేస్తాను
( ఈ మాట చెప్పినప్పుడు నాకు ఇలాంటి స్నేహితురాలు ఉంటే ఎంత బా
గుండో కదా అనిపించింది...నేను చేశాను నమ్మకం లేని మషితో స్నేహం..అది గతం లెండి )
నేను :-> ఈ కాలం అమ్మాయిల డేటింగ్ లు పబ్బుల చుట్టూ తిరగడం..కరెక్టేనా
ఆమె :-> అది వారి ఇష్టం బట్టి ఉంటుంది డేటింగ్ అనేది మాత్రం ఒళ్ళు బలిసి చేసేది ( ఇలా హార్డుగా మాట్లాడినందుకు ఏమనుకోవద్దు నా ఒపీనియన్ అంది ఆమె) పబ్బులకు తిరగడం ఫాష్టు కల్చర్ చెడిపోతాను అంటే ఎవ్వరు ఏమి చేస్తారు ...వీరి ఇలా చెడిపోవడానికి తల్లిదండ్రులదే తప్పు..వాళ్ళు పట్టీంచుకోకపోబట్టే వీరు ఇలా బరెతిగిస్తున్నారు
...( మిగిలిన ఇంటర్వూ తరువాత పోష్టు చేస్తాను )