ముంబైలో దారుణ మారణ్ కాండ స్రుష్టించిన ఉగ్రవాదులు...ఎదుటి వాళ్ళ ప్రానాలు తీసివాళ్ళు సాదించిందేమిటో నాకు అర్దం కాలేదు..ఆ సంఘటన తల్చుకున్నప్పుడల్లా కోపం తారాస్తాయికి చేరుతోంది..అయినా మనం ఏంచేయగలం స్వార్దరాజకీయాలు చేసే మన నాయకుల పరిపాలనలో మన కర్మ అంటూ అనుభవించాల్సిందే..ప్రపంచ దేశాలతో పాటు దూసుకెలుతున్నాం అన్ని రంగల్లో అని అంటున్నాం కాని పక్కదేశం నుంచి ముష్కరులు మనదేశ వాణిజ్యనగరం పై దాడి చేసి మారణకాండ స్రుష్టించారు..ముంబై నగరంలో ఎన్నో కుటుంబాళ్ళో నా అన్నవాళ్ళను పోగొట్టుకొని అంతులేని విషాదం వాళ్ళ్జజీవితాళ్ళో నెలకొంది కారణం ఉగ్రవాదుల మారణ కాండ ఆ ఉగ్రవాదుల్లో ఒకడైన కసబ్ ప్రానాలతో దొరికాడు..వీడివల్ల అసలు ఈ మారణ కాండకు కారణం ఎవరు అని తెల్సుకొని మన చట్టాలతో వాణ్ణీ శిక్షించ వచ్చు అనుకొన్నాం..
ఓ రోజు అఫీసులో ఉండగా మాసార్ పిలిచి ముంబై పోవాలి అన్నారు..నాకు ఒక్క నిమిషం అర్దంకాలేదు...అప్పుడు చెప్పారు కసబ్ పైజడ్జిమెంట్ సందర్బంగా..హైదరాబాద్ నుంచి లైవ్ (ఓ.బి) వెహికిల్ లో పోవాలి అన్నారు...సరే అని బయలు దేరాం 18 గంటల జర్ని అదీ వాహనంలో..డ్రైవర్, టెక్నీషియన్స్ ఇద్దరు మంచి మిత్రులు కావడంతో జర్ని హేపీగా జరిగింది..మొత్తానికి ముంబై లోని మా జీ న్యూస్ హెడ్ ఆఫీస్ కు చేరుకున్నాం..అక్కడ నాకోసం హైదరాబాద్ వాసి అయి ముంబై బ్రాంచ్ లో పని చేస్తున్న శ్రీనివాస్ ను ఎటాచ్ చేస్తున్నామని చెప్పారు..మరుసటి రోజుఉదయం 8 కి ఆఫీసుకు రమ్మని డ్యూటి వేశారు...వెంటనే హాటల్ కు వెళ్ళీ వెళ్ళగానే ప్రయాణ బడలికతో నిద్దుర పట్టింది .. కెమేరామెన్ శ్రీనివాస్ ను పరిచయం చేసుకొని ఇద్దరం కలిసి కొర్టు ప్రాంగనాణికి వెళ్ళాం అప్పటికే అక్కడ మీడియా హడావిడి ప్రారంబం అయింది..హైదరబాద్ నుంచి టివి9,ఈటివి. మా జీ 24 గంటలు మాత్రమే అక్కడి నుంచి ప్రత్యెక్ష ప్రసారం ముంబైనుంచి ఏర్పాటు చేశారు..హడావిడి మొదలైంది మా పిసీర్ నుంచి ఎప్పటికప్పుడు ఫోన్లు ఏంజరుగుతోందని అక్కడి నుంచి లైవ్ లోకి రమ్మనగానే అప్పటిదాగ సేకరించిన వివరలతో మొదటి మూంబైనుంచి మొదట ఫోన్ ఇన్ తరువాత ముంబైనుంచి లైవ్ రిపొర్టింగ్ ఇచ్చాను
న్యుస్ ఎక్స్ చానల్ వారు ప్రసారం చేసిన కసబ్ Confession ష్టేట్ మెంట్ చూడండి
( మిగిలిన వివరాలు మళ్ళీ చెబుతాను )