. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, December 18, 2010

నిశ్శబ్దం..యుద్దం నడుస్తోంది..ఎన్నాలిలా..?



యుద్దం నడుస్తోంది..ఎన్నాలిలా..?
నాకు తెల్సు ఈ సమయం జీవిత కాలమని..అయినా..?

నిశ్శబ్దం కూడ
ఒక భాష
మౌన సముద్రపు ఘోష ..
అంతరంగం లో ఉప్పొంగే..ఆందోళ అలల నిశ్శబ్దపు ఘొష

నిశ్శబ్దం
నమ్మకమయిన నా నేస్తం
నిస్సబ్డమే
నా నిజమైన బలం
నిశ్శబ్దం
నా ఆత్మ విశ్వాసం దెబ్బతీసి వేసిన కంచే
నిశ్శబ్దం
నా దుఖ్హం హరించే ధ్యానం
నిశ్శబ్దం
కాలమంత శాస్వితం


నిశ్శబ్దాన్ని అక్షరీకరించలేను
అదో అక్షరం కు అందని భావం
అన్ని పాటల కన్న అతీతం
సత్యానికి అమ్మ నిశ్శబ్దం
సంగీతానికే సంగీతం నిశ్శబ్దం
ఆకలితో,ఆర్తితో ఆలకిన్చేవారికి
నిశ్శబ్దం సర్వ శబ్ద మయం
సకల రాగ రంజితం...

సత్య శోధనకు
ఆధ్యాత్మిక నిత్య సాధనకు
అసలైన మార్గం
నిశ్శబ్దం
ఆందోళనకు,ఆవేశానికి
కోపతాపాలకు
సిసలైన సమాధానం
నిశ్శబ్దం

జీవితంలో
ఎన్నో సందర్భాల్లో
అసలు గొంత్తెత్తి అరిచేది
నిశ్శబ్దం మే
శబ్ద సమూహాల్ని
చెల్లా చెదురు చేసేది
నిశ్శబ్దం మే..


పవిత్రతకు
దారి తెల్పే పరమ రహస్యం నిశ్శబ్దం
నీ మాటల తూటాలు
నీవు మిగిల్చిన గాయాల తాలూక మచ్చలకు
నిశ్శబ్దం
లేపనంగా మారి మాయం చేస్తుంది
అనే ఆశతో నిశ్శబ్దంగా జరిగేది చూస్తున్నా..
మళ్ళీ తిరిగి వచ్చే వసంతం కోసం కాదు..
ఆ ఆశ ఎప్పుడో చచ్చిపోయింది..
జరిగిన నిజం తెల్సుకునే రోజుకోసం..అ సలు నిజం తెల్సినరోజు ..
కార్చే కన్నీటీ బొట్టులో అబద్దం కొట్టుక పోతుందని ఎదురు చూస్తున్నా నిశ్శబ్దంగా..
కానీ ఆనిజం ఎప్పటికీ తెల్సు కోలేవని..తెల్సుకునే ప్రయత్నం చేయవనేది గట్టినమ్మకం..అదీ గమనిస్తున్నా నిశ్శబ్దంగా