Wednesday, December 22, 2010
నీ జ్ఞాపకాల కొలిమిలో...కాలుతున్నది నేనే!!
అవును !!
నీ జ్ఞాపకాల కొలిమిలో
కాలుతున్నది నేనే!!
ఎన్నాళ్ళీ నిరీక్షణ ??
...............
రాలేవా?
అలసిన నా మనస్సనే ఆకాశంలో కి
అరవిరియిన ఇంద్రధనుస్సువై
అక్షరం లాంటి నన్ను కావ్యం గా మార్చిన వాగ్దేవి వై..
నువ్వెపుడూ ఇంతే !!
ఇప్పుడు నీ కోసం ఈ నిట్టూర్పులు..
ఎన్నో నిశ్శబ్దాల గుస గుసలు
నేను చూసింది నీకళ్ళ లోని మెరుపులనే..
నీకళ్ళల్లోకి ఎన్ని సార్లు చూసినా చూడాలనిపించే మెరుపులు..
నాకు నీ మోములో మళ్ళీ మళ్ళీ చూడాపనిపించేది నీ కళ్ళే నేస్తం
ఇంకెన్నో మాట్లాడే చూపులు
ఎన్నో చూపుల రాతలు...
అవును....నిన్ను చూడగానే
నా కళ్ళు ప్రేమాక్షరాలని అచ్చు వేస్తూ ఉంటాయి
ఎదురు చూపులే
ఉచ్చ్వాస నిశ్వాసాలుగా
నీ ముందు ఎదను పరిచిన
నీ నేను!!
ఆ మెరుపులు ఎప్పటి కైనా చూడగలనో లేదో..