Wednesday, December 15, 2010
మానవ సంబందాల పై ఓ అమ్మాయితో చేసిన ఇంటర్వూ
అబ్బాయిలు,అబ్బాయిలు ప్రస్తుత పరిస్థితుల్లో వీరిమద్య రిలేషన్స్...ప్రేమ,స్నేహాల పేరుతో అవసరానికి ఆడుతున్న డ్రామాలు..మనస్సులో ఒకటిపెట్టుకోని బయటీకి ఒకటి నటించడం..స్నేహాల్లో నిజాయితీ ఇప్పటి ప్రేమల్లో వాస్తవాలు...అనే విషయం పై ముందుతరానికి ఇప్పుడు జరుగుతున్న వాస్తవ పరిస్థితులు తెలిపేందుకు ఓష్టోరి ప్లాన్ చేసుకొని..కొంత మంది యువతీ యువకులతో ఇంటర్వూ చేశాను...ఇప్పుడు యువతీ యువకులు కోరేదేమిటి..స్నేహానికి ప్రేమకు వాళ్ళు చెబుతున్న అర్దాన్నివెతకాలనే చిన్నిప్రయత్నం..ఇలా కల్సిని ఓ అమ్మాయితో చేసిన ఇంటర్వూ నన్ను నేను ప్రశ్నించుకునేలా చేసింది ఆమెలోని నిజాయితీ...అందరూ ఈ అమ్మాయిలా లేరు కాని అమెలోని నిజాయితీ జరిగిన జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే ఎందుకో ఎక్కడో తెలియని ఆందోళన...అందుకే అమె ఇంటర్వూను బ్లాగ్ లో పోష్టు చేస్తున్నా......( అమె పేరు మార్చాను..మరి అమె చెప్పిన నిజాలు అలాంటివి )అమె ను ఓ స్నేహితుని ద్వారా కల్సాను విషయం చెప్పాను..అప్పటికే నేను చేసిన ష్టోరీలు అమె చూసింది..నేను ష్టోరీల కోసం తీసుకునే లీడ్ తనకి ఇష్టం అని ఓ రకంగ నాఫ్యాన్ అంటూ చెప్పుకొచ్చింది..సరే ఆవిషయాన్ని పక్కన పెట్టి అసలు విషయానికి వద్దాం..ఓ చల్లని సాయం సమయాన అమె నుంచి నాకు ఫొన్ కాల్ వచ్చింది (5-12-2010 ) సార్ మిమ్మల్నికలుద్దాం అనుకుంటున్నాను అని...నేను చెప్పాను నీ ఇంటర్వ్యూకావాలి అని మొదట కల్సి మాటలాడదాం అని చెప్పింది..తనకి ఆరొజు సెలవు కావడం తో అసలు అమె ఒపీనియన్స్ ఎలా ఉంటాయో తెల్సు కోవచ్చుగాఅని కెమేరాలేకుండా ఆఫీసులో పర్మిషన్ తీసుకోని వెల్లాను..ఆ..ఇంటర్వూ విషేషాలు అమె నిజయితీగా చెప్పిన సమాదానాలు రేపు పోష్టుచేస్తాను..ఇప్పుడు టైం 4:00 ( రాత్రి )దాటింది ఎందుకొ నిద్రరాక కంప్యూటర్ ముందు కూర్చున్నా..మూడ్ సరిగా లేదు (కారనం..?)
సరే ఇకమొదలు పెడతాను..చెప్పిన సమయానికి అక్కడికి వెల్లాను...అమె ఎక్కడవుందో తెలియదు..అడగలేదు..ఫోన్ చేశాను సార్ నేను వచ్చి చాలాసేపు అయింది..మీకోసమే వైటింగ్ అంటూ తానున్న ప్లేస్ చెప్పింది..గతంలో అదే ప్లేస్ లో ఓ కూర్చున్నప్పుడు పాతజ్ఞాపకం గుర్తుకు వచ్చింది....అది గతం ఇది వాస్తవం అని గుర్తుకు వచ్చి ఆవిషయాన్ని పక్కనపెట్టి..సరే చెప్పండి అన్నాను ఏదో ఆలోచనలో..కారణం అక్కడ ఉన్న వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది ఎవ్వరు ఎలాపోతే నాకేంటి...నన్నెవరు ఏమనుకున్నా నేను అందరికి మంచే చేస్తాను అని ప్రక్రుతి అన్నట్టు గా అనిపించిందినాకు ......మీరడిగితే నేను సమాదానం చెబుతాను.. అనటంతో సోది అడగకుండా డైరెక్టు పాయింట్ కు వద్దామని ప్రశ్నించడం మొదలు పెట్టాను
నేను :-> నీ పర్సనల్ గురించి అడుగుతున్నాను అనుకోకు మీరు ఎవరిని అన్నా ప్రేమిస్తున్నారా ..
ఆమె:-> తప్పేముంది సార్ 8 సంత్స్రాలుగా ఒ అబ్బాయిని ప్రేమిస్తున్నాను..మాకు ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం..అలా కొనసాగుతుంది..
నేను:-> నీకు స్నేహితులలో అబ్బాయిలు ఉన్నారా...అమ్మాయిలు ఉన్నారా..
ఆమె:-> ఇద్దరూ ఉన్నారు అబ్బాయిల తో అమ్మాయిలు స్నేహం చేయకూడదా...నాకు అమ్మాయిలతో కంటే అబ్బాయిలతో నే స్నేహంగా ఉంటాను అమ్మాయిలు ఒ పట్టాన అర్దంకారు..అబ్బాయిలు నాతో మంచిగా ఉంటారు అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు
నేను :-> మరి ఈ విషయం నీవు ప్రేమిస్తున్న అతనికి తెలుసా...
ఆమె:-> తెలుసు సార్ ముందే చెప్పాను ..మొదట్లో గొనిగాడు ఆతరువాత నాపద్దతి చూసి సరే అన్నాడు...తనని అయినా వదులుకుంటాగాని స్నేహితుల్ని మాత్రం వదులు కోను అని ఓ సందర్బంలో గట్టిగా చెప్పాను
నేను :-> ఏసందర్బంలో చెప్పవలసి వచ్చింది తెలుసుకోవచ్చా మీకు ఇబ్బంది లేకపోతే
ఆమె:-> తప్పకుండా సార్ తన ప్రేండ్స్.. నా బాయి ప్రేండ్స్ గురించి ఏదో చెప్పారంట అది నన్ను అడిగాడు అప్పు గట్టిగా చెప్పాను...ఓ మగ ఆడ మాట్లాడి తే అలాంటి సంబందాలు అంటగడితే ఊరుకొనని వార్నింగ్ ఇచ్చాను
....( ఇంకా ఉంది సమయం దొరికినప్పుడు పోష్టు చేస్తాను)