పరవశింప జేసే ప్రక్రుతి అందాలు..మనసును పులకింప జేస్తున్నాయి..
చిగురు తొడిగిన కొమ్మపై చినుకు చేసే అందాలు,
మంచు కురిసిన వేలలో ఆకుల పై వెలసిన స్వచ్చమైన నీటి బొట్టు
చినుకు తాకిన బూమిపై మట్టి పంచే పరిమళాలు,
పుడమి పంచిన ప్రేమతో ప్రకృతి చూపే సోయగాలు,
ప్రకృతి సోయగాలతో పరవశించి కోయిల పాడే స్వరాలు,
కోయిల స్వరాల మాధుర్యంతో ప్రక్రుతి పులకిస్తొంది,
మది రాసిన కావ్యాలతో విరిశిన చిరునవ్వులు,
ప్రతి అందం అద్బుతం, ప్రతి అంశం అమృతం.
పవవళ్ళు తొక్కే జలపాతం నీనవ్వు..
నవ్వీ నవ్వనట్టుండె నీ నవ్వు..విరిశీ విరయని పువ్వేకదా