Friday, December 31, 2010
నేనెందుకు న్యూఇయర్ వేడుక జరుపుకోవాలి
నేనెందుకు న్యూఇయర్ వేడుక జరుపుకోవాలి...
ఏమి సాదించానని...మనల్నిమనం ప్రతిక్షనం ప్రశ్నించుకుంటే అన్నీ ప్రశ్నలే..?
ప్రొఫిషన్ లో బాగంగా కొంతమందికి సహాయంగా ఉండి ఉండవచ్చు .. అది భాద్యత..
మనకిష్టమైన వారికి ప్రత్యెక్షంగా కాని పరోక్షంగా కాని సహాయం చేయక పోగా ఇబ్బంది పెట్టామా..?..
ఒక వేళ అలా ఇష్టమైన వారిని మనసు కష్ట పెట్టి ఉంటే న్యూఇయర్ వేడుక చేసుకునే అర్హత లేదు..
అటు నీ స్నేహితులని భాదపెట్టిన విషయం ప్రతిక్షణం గుర్తుకు వస్తుంటే..
అన్నీ మర్చిపోయి ఏదో సాదించినట్టు న్యూఇయర్ వేడుక జరుపుకోవాలా...?
అందుకే నాకు వచ్చిన న్యూఇయర్ వేడుకల ఈ వెంట్స్ టిక్కెట్లు తెప్పించుకొని మరీ చించి వేశాను
నేనెందుకు న్యూఇయర్ వేడుక జరుపుకోవాలి...ఏమి సాదించానని...