Tuesday, December 7, 2010
మనిషిగా కొన్ని విషయాల్లో అయినా నిజాయితీగా ఉండు
నీ కోసం బ్రతక్కు ఉన్న సమయంలో కొంత సమయాన్ని ఇతరులకోసం కేటాయించు
ఇతరులకు మంచి చేయకపోయినా పర్వాలేదు కీడు చేయకు
చేసిన సహాయం గుర్తుంచుకోవాలని ప్రయత్నించకు
మనం అందరితో మంచిగా ఉండాలి కాని మనతో అందరూ మంచిగా ఉండాలనుకోవడం మాత్రం బ్రమే అని మర్చి పోకు...
నీకు ఎదుటి వానితో సఖ్యిత లేనప్పుడు...అతను నీగురించి మంచిగా చెబుతాడని ఆసించకు...తాను మంచి చేశానని చెబుతాడుకాని ఎదునివాని గొప్పతం నిజాయితీగా చెప్పే మనుష్యులు లేరనే వాస్తవం మరువకు
నివు నిజాయితీ గా ఉన్నాను కదాని ఎదుటి వారు అలాగే నిజాయితీగా ఉండాలని కోరుకోకు స్వార్దంతో ఎదురయ్యే ఎలాంటి పరిస్థితికైనా సిద్దపడు..
ఓ నిజమైనా స్నేహితులు ఎలాగుంటారో తెలుసా అయితే విను
ఈ సృష్టి ఎంత సహజమైనదో
సృష్టిలో జనన మరణాలు అంతే సహజ మైనవి .....
ఎందరో పుడుతూ ఉంటారు ... కాని ....
కొందరు మాత్రమే బ్రతుకు తారు .....
చాల మంది "తన కోసం" "మనకోసం" అంటూ
జీవితాన్ని గడుపుతారు ...........
అందులో నీ పేరు ఉందేమో అని అన్ని పెజీలు వెదికాను .
కాని అందులో నీపేరు లేదు.
చాల కొద్ది మంది మాత్రమే ఇతరులకోసం జీవితాన్ని
గడుపుతారు ...........
ఇందులో కుడా నీపేరు కోసం వెదికాను ,
ఆ ....ఆ కొందరిలో నీపేరు స్పష్టగా ఉంది ....
నీవు ఉన్నంతసేపు నీ ప్రేమ" పరిమళాలను "
వెదజల్లుతూనే ఉంటావు ...........
అది నీవక్కడి వల్లేసాద్యం ప్రియతమా