Monday, December 6, 2010
మనసు మాట వినదు..కాలం కసితీర్చుకోవాలని చూస్తుంది
రాత్రుల్లు ఆకాశం చుక్కలతో అందంగా అలంకరించుకుందా అన్నట్టు ఉంటుంది
ఆ కాశం వైవు చూస్తూ ఎంకాంతంగా ఉన్నప్పుడు ...ఆలోచనలు ఎక్కడికో పరుగుతీస్తాయి
కాలాన్ని శాసించ గలిగితే...గతం నేననుకున్నట్టు ఎందుకు జరగలేదు...ఎందుకు అన్నీ నాకే జరుగుతున్నాయి....నేను తప్ప అందరు ఎందుకు హాయిగా ఉన్నారు.. ప్రపంచంలో ఇంతమంది ఎందుకు నేనొక్కన్నేఉంటే పోలా..ఎవ్వరు వీళ్ళంతా...నేను ఏదనుకుంటే క్షనాల్లో అది జరిగితే...(చూశారా నాఆలోచనలు ఏకాంతంగా ఉన్నప్పుడు ఎంత వింతగా అనిపిస్తాయో ఒకదానికి ఒకటి పొంతనలేకుండా..? ) అందుకే ఏకాంతం ఎప్పుడూ నన్ను ఎదవను చేస్తుంది అని..!
ఇక్కడ చూడండి నామనస్సేకాదు...ప్రక్రుతి నాతో ఎలా పరాచకం ఆడుతుందో
నీరెండలో చలి కాచుకుంటూ ఉంటాను
ఏ చిలిపి మేఘమో సూరుడికి అడ్డం పడుతుంది
ఒక్కసారిగా వణికిపోతాను
మండుటెండలో పొలంలోని కొలనులో బట్టలిప్పి స్నానానికి దిగుతాను
ఇంతలో దట్టమైన మేఘాలు అల్లుకుంటాయి
బట్టలు తడిపేస్తాయి
అటుగా ఏదో అందం కదులుతుంటుంది చూడబోతాను
గాలి వీస్తుంది అది జారుకునేంత వరకూ
కళ్ళల్లో దుమ్ముని చూస్తాను
ఎండా వానా ఒకేసారి కాపు కాస్తాయి
ఎవరో ఎవరితోనో కలుస్తారు
అయోమయాతిశయంలో నేను
నడిచి నడిచి అలసి ఆగిపోతాను దాహంతో
దూరంగా తడి కనపడి పరుగులుతీస్తాను
నా నిట్టూర్పులు ఎండమావుల్లో కలిసిపొతాయి
ఏకాంత వనం లో ఎద ఏదో రాగం ఆలపిస్తూ ఉంటుంది
ఇంతలో ఆలోచనలు సీతాకోకచిలుకలైపోతాయి
పట్ట బుద్ధీ కావు ఒక్క చోటా నిలవవూ
.
ప్రకృతి లీలలు అంతుబట్టవు
మనసేమో మాట వినదు...