. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, December 31, 2010

“ప్రియతమా” అని మనసారా పిలవాలనిపిస్తుంది.


“నువ్వంటే నాకు చాలా ఇష్టం” – ఆడా మగా ఇద్దరి మధ్య చోటుచేసుకునే ఈ సంభాషణని చదవగానే ఎవరు ఎవరితో ఏ సందర్భంలో ఇలా అన్నారో ప్రస్తావించకపోతే ఇదేదో ప్రేమ వ్యవహారం అనే సందేహమే అధికశాతం మందికి సహజంగా కలుగుతుంది. ఒకే భావాలున్న ఇద్దరు వ్యక్తులు తమ ఆలోచనలను ఒకరిలో మరొకరు చూసుకుంటూ ఉబ్బితబ్బిబ్బయ్యే వేళ ఇలా ఇష్టాన్ని వ్యక్తపరుచుకోపోతే మనసు నిరాశ చెందుతుంది. ఆ ఇద్దరు వ్యక్తులు ప్రేమికులే కానవసరం లేదు.. స్నేహితులూ ఒకరినొకరు ఇష్టపడొచ్చు. కానీ ఆ ఇష్టాన్ని మనసారా మాటల్లో చెప్పాలన్నా “ఇష్టం” అనే పదం అపార్థాలకు తావిస్తుందేమోనని గుంజాటంలో చిక్కుకునే దుస్థితి మనది. నేస్తం తన స్నేహహస్తంతో హృదయాన్ని తడిమినప్పుడు “నువ్వంటే ప్రాణం మిత్రమా” అని మనసు ఒద్దికగా ఒదిగిపోతూ మూలగకపోతే మనలో స్పందనలు ఏమున్నట్లు? నిష్కల్మషమైన ఆ ప్రేమకు కూడా ఆద్యంతాలు,

“నిన్ను ప్రేమిస్తున్నాను, ఇష్టపడుతున్నాను, మిస్ అవుతున్నాను...” వాక్యాలు వేరైనా భావం ఒక్కటే... హృదయాన్ని మరో హృదయం ముందు పరచడం! “హృదయం” అనేది ఇప్పటి రోజుల్లో మనసుతోపాటు శరీరాన్నీ ప్రేమించే “సంపూర్ణ ప్రేమికుల”కు కట్టబెట్టబడిన పేటెంట్ వస్తువు. ఒకరి హృదయాన్ని మరొకరు తరచి చూడడం ప్రేమికులే చేయాలి. అపోజిట్ సెక్స్ కి చెందిన ఇద్దరు స్నేహితులు భావాలు కలిసి హృదయసావాసం చేసుకోవడం భౌతిక ప్రపంచానికి మింగుడుపడదు. హృదయాన్ని ప్రేమించడం అంటే శారీరక వ్యామోహమూ అందులో అంతర్లీనంగా ఉండి ఎన్నో హృదయాలకు మధ్య అగాధాలు పెంచేస్తున్నాయి.

నా నేస్తం తన ఆప్యాయతతో మనసుని నిమిరినప్పుడు “ప్రియతమా” అని మనసారా పిలవాలనిపిస్తుంది. కానీ గొంతులోనే సమాధి అయిపోతుంది ఆ పిలుపు. అలాంటి పదాలు వాడాలంటే మనసులో లేశమాత్రమైనా నటన లేకున్నా “నాటకీయత” ధ్వనిస్తూ అద్భుతమైన అనుభూతి అతి సాధారణం అయిపోతుందేమోనన్న భయం ఆవరిస్తుంది. భావవ్యక్తీకరణకు, ఇరువురు వ్యక్తుల మధ్య అనుబంధాన్ని పటిష్టం చెయ్యడానికి ఆలంబనగా నిలిచే ఆణిముత్యాల్లాంటి.. “ఇష్టం, ప్రేమ, ప్రియతమా, నేస్తమా... ప్రేమతో” వంటి పదాల్ని సినిమాల్లో యువహృదయాల్ని ఆకట్టుకుని కనకవర్షం కురిపించుకోవడానికి విచ్చలవిడిగా వాడేసి ఎంత చులకన చేశారో తలుచుకుంటే హృదయం తరుక్కుపోతుంది. యంత్రాల మధ్య భౌతికంగా మనమూ యంత్రాలమైపోయాం. గాఢమైన అనుభూతులను చులకనైపోయిన అమూల్యమైన పదాలతో పలకలేక మనసునూ యాంత్రికం చేసుకుంటూ సాగుతున్నాం...ఒకప్పుడు అలాపలికిన పెదాలే..ఇప్పుడు ఘోరమైన పదాలు పలికేందుకు సైతం వెనుకాడటంలేదు..కారనం ఎదైనకావచ్చు కనీసం అర్దం చేసుకోలేని మనస్సు లేనప్పుడు ఆ పదాలు పలికే అర్ష కోల్పోతారు మనం నుంచి నేను అనే స్వార్దం..నీలో ప్రవేశించినప్పుడు...మనస్సు గాయపరస్తున్నాను అనీ అయినా నీవు ఆలోచించగలిగావా..?...నీ మనస్సాక్షిని ఒప్పించే చేస్తున్నావా.].? తెలీక చేస్తున్నావా తెలిసి చేస్తున్నావా ఎంత తలలు పగుల కొట్టుకున్నా అర్దకావడంలేదు మిత్రమా అంత తీరిక నీకెక్కడిదిలే..నీవరకు నీవు హేపీగా ఉంటే చాలుకదా అనే నీవు అలోచిస్తావు..నా చిన్నిమనస్సు కూడా నీవు హేపీగా ఉండాలనే కోరుకుంటుంది అని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటే చాలు అదెలాగూ నీవు చేయవులే...