. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, December 29, 2010

నివురుగప్పిన అసంతృప్తులు చల్లార్చడానికి


సహజంగా ప్రతీ మనిషిలోనూ నివురుగప్పిన అసంతృప్తులు చల్లార్చడానికి, వాటిని ప్రకటితం చెయ్యడానికి కొన్ని అంశాలు కావాలి. ఇతరత్రా ఎన్నో అసంఘటిత అసంతృప్తులు మనసులో ఇమడలేక ఏదో రూపేణా, ఏదో ఒక బలీయమైన అంశం ఆసరాగా సమాజంపై, వ్యవస్థపై వెళ్లగక్కబడుతుంటాయి. అలాంటి అసంతృప్తులు విమర్శల జడివానలా పెల్లుబికేటప్పుడు మనం విమర్శించడానికి ఎంచుకున్న అంశం ఒక్కటే బయటి ప్రపంచానికి ప్రదర్శితం అవుతుంది తప్ప ఆ అంశానికి మూలాధారాలైన అస్పష్ట అసంతృప్తులు నిగూఢంగానే ఉండిపోతాయి. అందుకే ఏ విమర్శకైనా నిర్థిష్టమైన ఆధారం ఉండదు. తిట్టాలనిపిస్తోంది కాబట్టి తిడుతుంటాం. ఎందుకు తిట్టాలి అని ఎదురు ప్రశ్నించుకుంటే ఆ అంశంపై మనకున్న వ్యతిరేకత కన్నా మనలో గూడుకట్టుకున్న ఇతర అసంతృప్తులదే కీలకభూమిక అని తేలుతుంది. అకారణంగా ప్రతీ దాన్నీ విమర్శిస్తూ ఓ రకమైన అసంతృప్తివాదులుగా చలామణి అయ్యే వారు ఎక్కువగా ఈ కోవకు చెందుతుంటారు. జీవితంలో మూటగట్టుకున్న చేదు అనుభవాలు ప్రతీ దానిలోనూ లోపాలు ఎత్తిచూపే తత్వాన్ని మిగల్చడం వల్ల... బలీయమైన కారణం లేకపోయినా అన్ని అంశాల పట్లా నిరసన గళమే వీరిలో ప్రస్ఫుటంగా కన్పిస్తుంటుంది.

ఇదిలా ఉంటే అందరికీ బాగా కన్పించే దానిలో లోపం వెదికిపట్టి మరీ అందరి దృష్టినీ ఆకర్షించాలన్న తపన కొందరిలో కన్పిస్తుంది. ఆయా అంశాలతో వాస్తవానికి వీరికి ఎలాంటి సమస్యా ఉండదు. ఆ అంశం లోతుపాతులు తెలిసి ఉండవలసిన అవసరం కూడా వీరికి లేదు. ఆ అంశంపై అనుభవం, అవగాహన లేకపోయినా భౌతికంగా ఆ సమస్య ఎలా కన్పిస్తుందో ఆ నిర్మాణాన్ని స్థూలంగా మనసులోకి తీసుకుని విశ్లేషించి యధేచ్ఛగా విమర్శకు దిగుతుంటారు. ఇక్కడ వారి లక్ష్యం తమ తార్కికత పదిమంది గుర్తించాలన్నది. సమస్యపై గతానుభవం వల్ల వచ్చే గాఢత లేకపోతే ఇప్పటికప్పుడు అల్లుకున్న తర్కం నిష్ర్పయోజనం అన్నది వారు గుర్తించలేరు.

అసంతృప్తుల వల్లనైతేనేమి, గుర్తింపు యావతోనైతేనేమి ఏ అంశంలో అయినా మొదట మనం చెడునే చూడగలుగుతున్నాం అంటే మన మనస్సు విమర్శలు, వివాదాలకు మాత్రమే ఆనందం పొందేలా లంగరు వేయబడిందన్నమాట. సమాజంలో అక్కడక్కడ మంచి జరుగుతోందంటే నమ్మలేనంత, నమ్మినా దాన్ని జీర్ణించుకోలేనంత, ఆ మంచిని లేనిపోని సందేహాలతో నిరుత్సాహపరిచేటంత మైకంలో కూరుకుపోయినట్లు లెక్క.. చివరిగా ఇది ఓ ఒక్కరినో గాయపరచడానికి చేసిన విశ్లేషణ కాదు. విమర్శించడంలోనే ఎక్కువ ఆనందం చూస్తూ మంచిని గ్రహించలేకపోతున్న మనలోని ఓ పార్శ్యాన్ని వెలికి తీసే ప్రయత్నమే ఇది.