Wednesday, December 22, 2010
ఇన్నిన్ని భావనలు నీకై పొందు పరుస్తున్నా...
ఇన్నిన్ని అక్షరాలతో నిన్ను కీర్తిస్తున్నా...
ఇన్నిన్ని పదాలతో నిన్ను పూజిస్తున్నా...
ఇన్నిన్ని కవితలతో నా మనోబావలను తెలుపుతున్న..
ఇన్ని చేసిన నాకు, నీవేమి చేయగలవు...?
ఒక్క పదమై పలుకలేవా భావనలుపెదవిపైన...
ఒక్క క్షణమైనా చూడలేవా కలమపైన...
ఒక్క గడిఅయినా ఒప్పుకోలేవా నాది ఉహ కాదు నిజమని...
ఒక్క మాటైన చెప్ప్పలేవా నా ఉహకి మొదట ప్రాణం పోసింది నువ్వేనని...
ఇంతకన్నా నిన్నేమి అడగను...
ఇంతకు మించి నిదగ్గర ఏమి ఆశించాను...
నేను కోరేది ఒక్కటే...
ఈ అలజడి..
నాది కల్పనన కాదని, నీవు కలిస్తే అన్నీ నిజాలేనని
నిజం నీవు ఒప్పుకోవాలని...
నా ఆలోచన తప్పుకాదని చిన్న ఆశ...
ఆశపడటంలో తప్పు లేదు ....ఆశ నిజం అవ్వాలనుకోవడమే నా పిచ్చి కదా..?