అది సముద్ర తీరం...ఎందుకో ఒంటరితనం హాయి అనిపించి సముద్రతీరానికి వచ్చా ..
సముద్రంలో ఆటుపొట్లను చూస్తుంటే... జీవితాలే గుర్తుకు వస్తాయి....
ప్రక్రుతి జీవితాన్ని గుర్తుకు తెస్తాయి అనటాని ఈ ఎగిసిపడే అలలే నిదర్శనం..
వచ్చిపోయే అలల్లా జీవితం లో వచ్చే కష్టాలు శాశ్వితంకాదు..
ఒంటరిగ సముద్రతీరంలో ఇసుకతిన్నెపై కూర్చొని పిచ్చిగీస్తున్నా మనసులోని భావాలు ప్రతిబింబిచేలా..
ఒక్కసారిగా వచ్చిన అలలు అన్నిటినీ చెరిపివేసి వచ్చినంత ఆవేశంగా సముద్రంలోకి వెళ్ళి పోయింది..
మరి మనుష్యుల హ్రుదయాల్లో పాతుకపోయిన మరువలేని అనుభవాలు
చేదు జ్ఞాపకాల్ని ఎవరు వచ్చి రూపు మాపుతారాఅని ఎదురు చూస్తున్నా