Saturday, December 4, 2010
జ్ఞాపకాలు మనసును చింద్రంచేస్తాయి....
జ్ఞాపకాలు మనసును చింద్రంచేస్తాయి.....
మదుర మైన అనుబూతులు గుర్తుకుతెచ్చే జ్ఞాపకాలు ఓసారి గుర్తుకు వస్తే తీయ్యని అనుభూతి..
గతం ఎప్పుడూ తీయగానేఉంటుంది మదుర జ్ఞాపకంలా మిగిలిపోతుంది కొన్ని జ్ఞాపకలే మనసును చింద్రంచేస్తాయి..
గుర్తుకు రాకూడదు గుర్తుకు తెచ్చుకోకూడదనుకున్నవే మరీ మరీగుర్తుకొచ్చి మనసును ముల్లులా గుచ్చుతుంటాయి..
కాలం కొన్ని జ్ఞాపకాలను మరిపిస్తాయి కాని అవే జ్ఞాపకాలు కొన్ని సంఘటనలతో తిరిగి గుర్తుకొస్తాయి..
గతం వద్దు వద్దు అనుకున్నా ఈ జ్ఞాపకమే గతాన్ని తవ్వి గుర్తుకు తెస్తూంటాయి...
కొన్ని సార్లు అవే జ్ఞాపకాలు మనసులో ఉన్న భాదను దూదిపింజను చేసి మనసుకు ఉల్లాసాన్నిస్తాయి
చిత్ర విచిత్ర మైనా జ్ఞాపకాల దొంతర కదిలి పాత కాలం అనుభూతుల్ని గుర్తుకు తెస్తాయి..
ఒకసారి మెంటల్లీ హేండీ కాప్డ్ మనుషులను చూసినప్పుడు వీరికి గతం ఎప్పటికీ గుర్తుకురాదు కాబట్టే ఇంత హేపీగా ఉన్నరా అనిపిస్తు0ది..
ఏఘటన ఐన గతం గుర్తుకు రాని జ్ఞాపకంలాగా ఉంటేనే బాగుంటుంది..
ఈ జ్ఞాపకం గుర్తుకురాకుండా ఉండాలంటే క్షనం తీరిక లేకుండా ఉంటే ఏవి గుర్తుకురావు
"" బాల్యిం మధుర జ్ఞాపకాలు మరిచిపోలేనివి ఎప్పటికీ గుర్తుండిపోయేవి """
( నా పాతజ్ఞాపకాల తాలుకా ఫొటోలతో కూడిన విడియో చూడండి...నేను ఇంటర్లో ఉండగా అసలు ప్రపంచంఇలాఉంటుందా అని తెల్సింది...నా ఊహలకు రెక్కలు వచ్చిన సమయం అది అప్పుడే శివా సినిమారిలిజ్ అయింది.....అప్పటి పాతజ్ఞాపకాల తాలూకా మదుర మైన ఘటనల తాలూకా ఫోటోలే ఇవి ప్రపంచ జ్ఞానాన్ని అప్పుడప్పుడే తెల్సుకుంటున్నరోజులవి.. )
గుండె గదిలో పదిల పరిచా నీ జ్ఞాపకం..
పసిడి రేకులో మడిచి నీ జ్ఞాపకం..
మడత విప్పి చూసుకుంటే…వ్యాపించెను పరిమళం…
ప్రేమ తో తాకాను నేను బంగారు బాల్యాన్ని..
హ్రిదయంతో తడిమి చూసా వికసించిన యవ్వనాన్ని..
మదిని మురిపించీ కవ్వించే నీ జ్ఞాపకం…
వడలలేని కుసుమమల్లే నీ జ్ఞాపకం…"
ఒక్కోసరి ఇలా గుర్తుకొస్తాయి చిన్నప్పటి మధుర మైన జ్ఞాపకాలు
మనస్సు పొరల్లో జ్ఞాపకాల అలలు..
ఎగసి పడి రకరకాల తీరాలను తాకాయి..
తీర తీరానికో తీపి గుర్తు..
ఈ జీవన సంద్రం లో
కడలి లో కరిగిపోయిన కలలెన్నో..
అయిన అలసి పోని అలలు కదులుతూనే ఉన్నయి..
కదిలేది సాగరమైతే ..
రాసేది కవిత్వమే..
స్పందించే హ్రిదయమైతే..
ప్రక్రుతి అంతా సుందరమే..
నిలిచేవి నిజాలైతే..
వాటిని కొలిచేది ఊహలే..
తలిచేది మనస్సైతే ..
పలికేది భావమే..