Saturday, December 11, 2010
మనసు చేరిన ఓ నేస్తమా..ఏ మైయిందీవేళ
ఏమైంది నా మనసుకి కొత్తగా ఈ ఆందోళన.
దరిచేరనంత దూరం అయ్యావని తెల్సీ..ఏదో అలజడి
నీగురించి ఆలోచనలు కొత్తగా అనిపిస్తూన్నాఈవేళ
నీవు నను వీడి పోయావు అనే అలోచన గుండెలో అలజడి రేపుతుంది.
మనం విడిపోయిన ఇన్ని రోజుల్లో ఏ రోజు లేదే ఇలా?
ఈ రోజు ఏమైంది నా మనసుకి కొత్తగా..
ఏమైంది నాకు నేస్తమా నీవైనా తెలుపవా?
గతంలో జరిగింది అంతా నిజంకాదని..
అంతా ఒట్టి బ్రమేనని నా మనసుని నమ్మేదెలా?
ఏమైంది నా మనసుకి నిన్ను చూసి కొత్తగా భిడియ పడుతుంది.
నీ చేరువని నా నుండి దూరం చేస్తుంది...
ఒకప్పుడునీవు దగ్గరవుతుంటే హాయిగా అని పించేది ...
మనం కల్సుకొని మాట్లాడి విడిపోతున్న క్షణాన బాధ అనిపించేది
ఎన్నోసార్లు నీతో అన్నా అదే ఇప్పుడు నిజం అయింది
నను నీవు వీడి పోయావంటే గుండెలో అలజడి రేపుతుంది.ఇప్పటికీ
దరిచేరవని దూరం అయ్యావని తెల్సి ఈ రోజేమిటి ఈ కొత్త ఆనందం...
పాత జ్ఞపకాలు మనసుని మైమరపిస్తున్నాయి నాకుతెలీకుండా
ఏమైంది నాకు నేస్తమా నీవైనా తెలుపవా?
నాదరికి చేరని ఓ మదురస్వప్నమేనని.. మనసుని నమ్మేదెలా?
మనసు చేరిన ఓ నేస్తమా..ఏ మైయిందీవేళ