Friday, December 24, 2010
మీరు బ్లాగ్ స్పాట్ లకు అశ్లీల కామెంట్స్ పంపిస్తున్నారా..?
మీరు బ్లాగ్ స్పాట్ లకు అశ్లీల కామెంట్స్ పంపిస్తున్నారా..? కాస్త జాగ్రత్త బ్రదరూ..మీ ప్రొఫైల్ హైడ్ చేశాంకదాని మురిసిపోకండి..మన సైబర్ క్రైం పోలీసుల వద్ద లేటెష్టు టెక్నాల జీ అందుబాటులోఉంది..మీ ఐపి అడ్రస్ లు రికార్డు అవుతున్నాయి మీరు కామెంట్ పంపిన టైం ఎలాగూ వస్తుంది కాబట్టీ ఆ టైంలో వచ్చే కామెంట్ ఏ ఐపి అడ్ర్రస్ నుంచి వచ్చిందో ఇట్టే పసిగట్టవచ్చు... నాకు ఇలాగే ఈరోజు ఓ కామెంట్ వచ్చింది..kish పేరుతో 1:56 AM కు వచ్చింది ..ఆ విషయమై నేను సైబర్ క్రైం పోలీసులను అడిగినప్పుడు ఈ విషయం తెల్సింది..మీకు ఆబ్లాగ్ లో విషయాలు నచ్చకపోతే వదిలేయండి..లేదా ఆవిషయాన్ని బ్లాగర్ కు చెప్పండి అంతేకాని అసభ్యికరంగా మీరు కామెంట్స్ పంపారో జాగ్రత్త..మహిళా బ్లాగర్లు ఇలా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే నాకు సమాచారం ఇవ్వండి
...ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు కోసం ఓ హెల్ప్ లైన్ బ్లాగ్ మొదలుపెడతాను అది సైబర్ క్రైం పోలీసుల సహాయంతో...