Tuesday, December 14, 2010
.వీళ్ళు మనుషులా..? ఎక్కడికి పోయింది మానవత్వం..?
.వీళ్ళు మనుషులా..? ఎక్కడికి పోయింది మానవత్వం..?
ఒక్కసారి పైన కనిపిస్తున్న ఫోటోలను చూడండి మనసును ఎవ్వరో కెలుకుతున్నట్టు అనిపిస్తుంది కదా..అవును నిజమే అసలు విషయంతెల్సుకుంటే జరిగేది కూడా అదే మరి కొన్నిసార్లు జరుగుతున్న సంఘటనతాలూక విషయాలు గుర్తుకు వచ్చినప్పుడు...మనసు కలత చెందుతుంది...నేను టివి9 లో పని చేస్తున్నప్పుడు జరిగిన ఘటన..ఉస్మానియా హాస్పిటల్ వైద్యులు నిర్లక్ష్యానిని నిదర్శనం..పైన ఫోటోలు ఇప్పటికే చుసివుంటారు..చూడండి మనిష్యుల్లొ మానవత్వం లోపిస్తున్నాయి ఈ ఫొటోలే నిదర్శనం..ఉస్మానియా హాస్పిటల్ బయట మార్చురి గేటు వైపు చిన్నగా మూలుకు వినిపిస్తుంది....అప్పుడు అటుగా వెలుతున్న నేను ఆ ద్రుస్యాలను కెమేరాలో బందిచి వివరాలు సేకరించే ప్రయత్నం చేశాను అప్పుడు తెల్సింది... ఉస్మానియా హాస్పిటల్ లో జాయిన్ అయిన అనాదను ఎలాంటి ట్రిట్ మెంట్ ఇవ్వకుండా మామ మాత్రపు ట్రీట్ మెంట్ ఇచ్చి ఇలా చత్తకుప్పలో పడవేశారు ఆని...అప్పుడు నేను టివి9 లో పని చేస్తున్నాను ఈ విషయాన్ని మా ఇన్ చార్జ్ ద్ర్షుష్టి కి తీసుకెల్లాను ..వెంటనే ఆష్టోరీని టెలికాష్టు అయి ఈ ఘటనకు కారణం అయిన వారిని సస్పెండ్ చేసి అతనిని హాస్పిట్ ల్ లో చేర్పించి ట్రీట్ మెంట్ చేశారు... కాని ఎందుకో అతని కి ఎలా ఉందో చూద్దామని మరోసారి హాపిటల్ కు వెలితే మళ్ళీ నిర్లక్ష్యిం అక్కడ కనిపించింది..గొడవచేసి నిర్లక్యింగా ఉద్యొంగం చేస్తున్న వారిని సస్పెండ్ చేయించి నా..మళ్ళీ అదే నిర్లక్ష్యిం సదరు బాదితున్ని హాస్పిటల్ సిబ్బంది క్రింద దిక్కులేని వానిలా క్రింద పడుకో పెట్టారు (ఫొటో లో ఆద్రుస్యిం మీరు చూడవచ్చు) ఉండటం జరిగింది మీడియా కల్పించుకొన్నా అక్క పరిస్థితులు నిర్లక్ష్యానికి ప్రత్యెక్ష సాక్ష్యిం ఈ ఘటన..మళ్ళీ హడావిడి చేసి మంచి ట్రీట్ మెంట్ ఇప్పించ గలిగాను కాని ఆ వ్యక్తి తన వివరాలు అందించకుండాని తిరిగిరాని లోకాలకు పోయాడు ..లోకంలో జరిగే ఇలాంటి ఘోరాలు చూడలేను అనుకున్నాడో ఏమొ మరి నాకు ఈ ఘటన్ గుర్తుకు వచ్చినప్పుడల్లా అతన్ని ఎందుకు బ్రతికించలేక పోయానా అనే చిన్ని భాద మాత్రం మిగిలిపోయింది..