ఇలా ఎందుకని..జరుగుతోంది..?
నీవిక కలువను అనేమాటను ఎందుకని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా..?
అది నిజంకాదు కాదు నిజంకాకూడదని అనిపిస్తున్నా ఎక్కడో చిన్నభయం..
ఈ మాట గతంలో కన్నీరే ఎరుగని కనుపాప కు తెల్సి అల్లాడింది..
అసలు నీకు ..నాకు ఉన్న బందమేమిటని ప్రశ్నించింది..?
నీవు నావద్ద ఉన్నప్పుడు మాత్రమే నావదనంలో ఉండే ధీమా ఇప్పుడు మాయం అయింది..
రేపటి నీవు నాతొ లేవు అని ఎప్పటికి మాట్లాడవనే నిజం నిజంకాదనే మాట గుండెను ఇంకా భారం చేస్తోంది..
అసలు నీవు నాకు ఎందుకు దూరం అవ్వాలి అని ప్రశ్నించుకంటే అస్సలు సమాదనమే దొరకడం లేదు..
నా మది కోరుకుంటోంది..నీనీడలో నీచిరునవ్వుల జల్లులోతడవాలని ..