. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, December 19, 2010

ఓ జీవిత కాలపు పయనం...నిన్ను నువ్వు నమ్మటం



యుగాల రహదారిలో
సెకెనుల సకలాలపై
ఓ జీవిత కాలపు పయనం
నేను లేవలెను అన్న బలవంతంగా నా కాళ్ళు సాగదీసి నిలబెడుతుంది
నేను రాను అంటున్న కర్కశంగా తన వెంట లాక్కు లాక్కుపోతుంది
నేను నడవనన్న తానే ఎదురొచ్చి గతమై గడిచి పోతుంది
ఈ పయనంలో ...
తనను దాటి నన్ను పొనీదు
నన్ను దాటి తాను పోలేదు
నన్ను గెలవనీదు ....ఓడనీదు
చచ్చేదాక చావనీదు .
కలిసి రాని కాలం నాతో కలిసి నడుస్తుంటే
కలవలేని కలల తీరాన్ని కంటిపాప కలవరిస్తొంది
చిత్రంగా లేదు ....?
ఈ కాలం చేసే గలాటానికి గులాము చేసే నవాబు నేను .
నా రేపటిని నేటిగా నాకిచ్చిన ఈ నిమిషాన్ని..
నిన్నటి తిమిరానికి తిరిగిఇవ్వలేను
అలా అని నా కాళ్ళ కింద నలుగుతున్న ఈ నేటిని
అలానే అదిమివుంచనూ లేను
అందుకే నీరు కారుతున్న ఈ నిమిషాలను బొట్టు బొట్టుగా పోగేసి
నాకంటి పాప కొలనులొ స్వప్న సౌధాలు నిర్మించుకుంటున్న..

ఈ గతుకుల బతుకులొ భారమైన క్షణాలను
బాద్యతగా బద్రపరుస్తూ,వాటిని అనుభవాలుగా
అనువదించి నా రేపటి తరానికి దారి చూపే దీపాలుగా వదిలి వెలుతున్నా...
చెరువవుతున్న కొద్దే దూరమవుతున్న ఈ ఆనదాల ఎండమావిలో
ఎక్కిళ్ళు అయ్యి ఉపక్రమించే నా దుఃఖానికి దప్పిక తీర్చె కన్నీటి చెలమల్ని తవ్వుకుంటున్నా...

నిన్న నాకొక జ్ఞాపకం

నేడు నాకొక వ్యాపకం

రేపన్నది ఎప్పుడూ ఓ ప్రశ్నే

జ్ఞాపకాల వ్యాపకంలో రేపటి ప్రశ్న
సవాలు కావచ్చు
సమాధి కావచ్చు

నా ప్రతి నేటిలో రేపటి నన్ను ప్రశ్నించే ఈ ప్రవళికకు జాబు వెతికే బతుకు బాటసారిని నేను