Tuesday, December 21, 2010
నీ జ్ఞాపకం...కలలాంటి జ్ఞాపకం
కల ఒక జ్ఞాపకం
గుర్తుకొచ్చి రాక తికమక పెడుతుంది
జ్ఞాపకం ఒక కల
నిజమో భ్రమో తెలియని అయోమయంలోకి నెడుతుంది
కలలాంటి జ్ఞాపకం
జ్ఞాపకం లాంటి కల
నువ్వే....
నువ్వెవరో...
అనుక్షణం వెంటాడుతుంటే నా నీడవనుకున్నాకున్నా
కానీ నీదయిన రూపం నీకుంది..నీకు దయలేదు..
నీ హ్రుదయం బండరాయి..
నీ ఒక అందమైన రాక్షశివి
ప్రతిక్షణం నీ ఆలోచనలే చుట్టుముడుతుంటే
కించిత్ ఆలోచనలేని నీవు
నువ్వే నా మనసనుకున్నా
కానీ నీకేన్నో జీవితాలున్నాయి
నా నీడవు కాక నేను కాక ..నీకెన్నో
వేకువఝామున నిద్దుర లేపే పిల్ల తెమ్మెర నువ్వే
నా ముంగిలి తాకే తొలి సూర్యకిరణం నువ్వే
నా కిటికిలోంచి తొంగిచూసే మల్లె పరిమళం నువ్వే
రాత్రంతా నన్నల్లరి పెట్టే వెన్నెల నువ్వే
కానీ నేనే
నీకేమీ కాను....అంటున్నది నువ్వే