నిషా రాత్రిలో నిద్దుర మాని
నీకై వెతికిన రోజులు ఎన్నో......
నీలో కలలకు రంగుల కోసం
తప్పక చేసిన తప్పులు ఎన్నో......
నీ పెదవుల చివరన నవ్వుల కోసం
నా మౌనం దాచిన మాటలు ఎన్నో......
నువు తెలియక చేసిన చేస్టల కోసం
నా సమయం చేసిన సవరనలెన్నో......
నువ్వుంటే నా కలల ప్రయాణం ,,
తప్పక చేరును నిజాల తీరం......
నీ నవ్వుంటే నా జీవితకాలం,,
బాదలు లేని విజయం ఖాయం......
అది నిజంకాదని తెల్సినా నావెదుకులాట ఆగదు..