వీచే చల్ల గాలులలో నీ స్పర్శను ఆస్వాదిస్తున్న,
నీ జ్య్నపకాలతొ నా ఒంటరి తనని దూరం చేసుకుంటున్న,
కురిసే వర్షం లో నా కన్నీటిని దాచుకుంటున్న,
మనసులో ఉన్న ప్రేమను కూడా అలానే వెంట పెట్టుకొని ఉన్న నీతో చెప్పలేక!!
ఏమని సమాధానం చెప్పను,
సాగరతీరంలొ ఒంటరిగా నడుస్తున్న నన్ను చూసి ఆ కెరటాలు ప్రశ్నించాయి,
నీతో నడిచే నీ తొడు ఏమయిందని,
సాయంసంధ్యవేళ అస్తమించే సూర్యుడు అడిగాడు,
నీ వెన్నెల కనిపించటంలేదేంటని,
నిన్ను వెతికే నా కళ్ళు అడిగాయి,
నీ మనసు దోచిన అందమేదని,
నాతో నడిచే నా నీడ అడిగింది,
తనతో నడిచిన తొడు ఏమయిందని?
ఏలా సమాధానం చెప్పను వాటికి,
కన్నీళ్ళను కానుకగా వదిలి తను వెళ్ళిపొయిందనా?
గుండెలొ మంటరేపి వెళ్ళిపొయిందనా?
మనసును ఒంటరిని చేసి వెళ్ళిపొయిందనా?
నన్ను కాదని వదిలి వెళ్ళిపొయిందనా?
ఏమని చెప్పను తను నా మనసుని తీసుకెళ్ళిపొయిందనా?
మూగబొయిన మనసులో మాటలు మాయమయ్యాయి.
మౌనమే సమాధానం అయ్యింది.