నా గుండెల్లో నుంచి దుఃఖం లాంటిది కెరటంలా ఉప్పొంగి వస్తోంది
నా కళ్ళలోని నీరంతా వేడికి ఆరిన ఎండమావిలా ఇంకిపోయాయి ...
ఇప్పుడు నా కళ్ళవెంట నీళ్ళు రావడం లేదు
అయినా నా హృదయం మాత్రం రోదిస్తూనే ఉంది ...
నీ జ్ఞాపకాలు కలిగించే ఆనందవిషాదాలను తలచుకోవడం నా చేతులో లేదు
కాని నాలో రగిలే ఈ ఆనందావేశాలకు ...రూపరహితమైన ఆ నా ఊహాస్మ్రుతలకు ...
చిరునామా నీ దగ్గరే ఉంది ......
ప్రతి ఉదయం నీ తలపులే నన్ను నిద్రలేపుతాయి
ప్రతిరాత్రి నీ గురించిన కల్లలే నన్ను నిద్రభుచ్చుతాయి
బౌతికంగా మాత్రామే నీకు దూరంగా ఉన్న ...
నా మది ఎప్పుడో నిన్ను చేరింది ......