. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, November 22, 2011

ఇదిగో వినిపిస్తున్నా చివరి సందేశం ...?

ఇదిగో వినిపిస్తున్నా చివరి సందేశం
శ్మశానం నుంచి నా ఆకరు స్థానం నుంచి
శవాన్నై మృత కలేబరాన్నై
దివంగతునై దిగంబరునై
నిచ్చేస్టునై నిత్తేజునై
నిచ్వాస ఉచ్వాస లకు అతీతునై
నిగామార్థ మోక్షానికి అనర్హునై
ఏది నా శైశవము ఏది నా యవ్వనము
ఏది నా కౌమారము ఏది నా వృద్దాప్యము
దేనిని తనివితీరా తాకనేలేదు
ఏది నా భోగము ఏది నా సౌక్యము
ఏవి నా సంపదలు ఏరి నా బందువులు
ఒక్కరైన నావెంట నడవనేలేదు
ఏది నా స్వార్థము ఏది నా మోహము
ఏది నా లోభము ఏది నా శోకము
ఇంకిప్పుడు కనుచూపు మేరనైన కానరానేలేదు
పట్టెడు మెతుకుల వెతుకులాట కై సాగిన బ్రతుకు సమరమున
గెలుపోటములింకా తేలనేలేదు
ఆశల మడుగులో అణువణువునా మునిగి విసిగి వేసారిన
నాకింకా ఓదార్పు అందనేలేదు
ఆశయాల కొలిమిలో నిలువునా రగిలిన నాకోసం
ఒక్క ఆసృవైనా నేలరాలనేలేదు
నిరాశతో నిసృహతో సాగిన ప్రయాణం శ్మశానందాకా
నడిదారిన ఆడంబరాలు మోసి మోసి అలసి సొలసి
చితి పాన్పుపై పవలించినాకా
ఇంకెందుకు ఆక్రందన ఇంకెందుకు ఆవేదన
ఇంకెందుకు గతస్మృతులు ఇంకెందుకు నా అన్నవారి వ్యధలు
ఇంకాసేపట్లో చితిమంటల అభిషేకానికి సన్నద్దమవుతూ
చిత్రంగా వినిపిస్తున్నానెందుకు చివరి సందేశం