ఇదో స్వబంధ సంబంధం ఇదో నిర్బంధ నియమం ...........
"అను" బంధాలను అనుభవించని అనుభవైకిక వేద్యం .........
ద్వీతీయతకు తావు లేని అద్వితీయ అద్వైతం............
నీడను సైతం తిరస్కరించే నిరంకుశ తత్వం
ఆత్మావలోకనమే తన లోకం ......స్థిమితం స్థితప్రజ్గ్నం తన స్వరూప స్వభావం ......
స్పందనలతో పనేముంది .........నిరంతర నిశ్శబ్దం
నిత్య సంగీతమై హృదయ స్పందనగా మారినపుడు ........
పులకింతలో పసేముంది .....పలకరింతకు నోచుకోని
పాశవికం పాశమై అల్లుకున్నప్పుడు ...................
పోగొట్టుకున్న జ్ఞాపకాలు వెతికి పెడుతూ ............
జ్ఞాపకాలు చేదయ్యాక తానో తీపి గురుతుగా మిగిలిపోతూ ...............
భయానికి హేతువు అవుతూ , ధైర్యానికి ప్రేరణ నిస్తూ ........
ఆత్మా దేహాన్ని వదిలే నిర్దయతకు నిరూపితమవుతూ ..........
నిత్యం నిలిచి వుండేది ఒంటరితనం ........