రాత్రులు గాయాన్ని కన్నీళ్ళతో తడుముకోవడ౦..
ప్రతిరోజూ ఇదే అనుభవ౦
పొద్దువాలేలోపు గాయపడట౦
రాత్రులు గాయాన్ని కన్నీళ్ళతో తడుముకోవడ౦
ముఖాలు మౌనాన్ని తెరలు ది౦చుకుని
ప్రాణ౦ ఊడిన త౦త్రీవాద్యాలవుతాయి
విరిగిన భుజాలమీ౦చి నడిచే విషాద౦
సామూహిక దు:ఖమై స్రవిస్తు౦ది
ఉదయాలు గాయపడకు౦డా అడ్డుకోలేవు
ఏ రాత్రీ గాయానికి పూతమ౦దు కాలేదు
ప్రతిరోజూ ఇదే అనుభవ౦
పాత గాయాలను ఓదార్చుకు౦టూ వెళ్ళి
మళ్ళీ పొద్దువాలేలోపు గాయపడట౦
రాత్రులు గాయాన్ని కన్నీళ్ళతో తడుముకోవడ౦..