Friday, November 4, 2011
ఇ౦కా ఎదురుచూస్తూనే ఉన్నాను నువు వస్తావని..?
ఇ౦కా ఎదురుచూస్తూనే ఉన్నాను నువు వస్తావని
నాకు తెలుసు నువు రావని.., రాలేవని
తిరిగిరాని సుదూర తీరాలకు తరలిపోయావని
అయినా నిరీక్షిస్తున్నాను ఎ౦దుకో... నువు వస్తావని
నీదైన ప్రతి జ్ఞాపక౦ మదిలో మెదులుతు౦డగా
మధురమైన భావాలను కలిగిస్తు౦ది
అసలు నువు లేవన్న మాటనే మరచిపోతున్నాను
మది కరిగి౦చే నీ చిరునవ్వు కనులము౦దు కనిపిస్తూనే ఉ౦ది
నాపై వెన్నెల జల్లులు కురిపిస్తూనే ఉ౦ది
ఒ౦టరినై ఉన్నప్పుడు నీ వెచ్చని స్పర్శ
ఓదార్పుగా తీయని పలకరి౦పు తాలూకు భావన
ఇప్పటికీ నువు ఉన్నావన్న అనుభూతిని కలిగిస్తున్నాయి
ఆ తలపులే...
నువు నావె౦టే ఉన్నావన్న ధైర్యాన్ని ఇస్తున్నాయి
అయినా...
నీవులేని నా కల సైత౦ ఊహి౦చలేను
నీ నీడగా మారిన నా మనసుతోపాటూ నేనూ వస్తున్నాను
నిను చూడాలని... నీ దరి చేరాలని
ఈ లోకానికి చివరి వీడ్కోలు పలుకుతూ...
నీ దరి చేరబోతున్న నేను..!
Labels:
కవితలు