Thursday, November 17, 2011
నీకూ నాకూ మధ్య ...నిశ్శబ్ధం లాంటి ఓపొర
నీకూ నాకూ మధ్య ...నిశ్శబ్ధం లాంటి ఓపొర
సమాజపు కట్టుబాటులా!వ్యక్తీకరణలో లోటుపాటులా!
ఎవరికి భయపడుతున్నావు ఎందుకు భయపడుతున్నావు!
మనసు పొరలో పెడుతున్న బావం నీకు తెలిపేదెలా!
నీ లైఫ్ గురించి ఏన్నో ఆలో చనలు చేశా..అందరి కంటే నీవు గొప్పగా ఉండాలని ..
నీగురించి కన్న కలలన్నీ కళ్ళలు చేశావు..ఎందుకో తెలీదు..
నా ఎదురుగా నన్ను కాదన్న ఘటన ఇంకా కళ్ళ ముందు మెదులుతోంది..
ఇద్దరి లో నన్నెందుకు కాదన్నావో అంటూ గుండెళ్ళో మెలికలు తిరుతుగున్నట్టు భాద..
అతని కంటే నేను నాస్నేహం గొప్పది కాదు అని అప్పుడే తేల్చావు కదా..?
నీకూ ఏదో చెప్పాలని ఉంది నీవు చెప్పేది వినాలని వుంటుంది
చెప్పలేక కట్టిపెట్టి నే బంధించిన ఓ భావానికి
నువు పదాలు పేరిస్తే,దాచిపెట్టినా దాగని
నీనవ్వులోని శబ్ధానికి మరో అర్ధం వివరిస్తే!
ఆ అర్దం అపార్దం చేసుకొని నన్ను కాదంటే!
గుండెను రాపిడిని చేస్తున్న ..గంతం తాలూకా జ్ఞాపకాలు..
ప్రతి జ్ఞాపకం గుణపాలై గుండేళ్ళో గాయాలు చేస్తూనే ఉంది..
అప్పుడు అలా ..ఇప్పుడిలా ...ఎందు కలా అంటూ..
అప్పుడు నాగురించి అంతకేరింగా ఉన్ననీవు ఇప్పుడు ఎందుకలా మారావు..?
మనసులు అంత తోందరగా మారతాయా...?
ఏదో ఓ రోజు ..ఎదురొచ్చే ఆ క్షణం
ఎలా వస్తుందో అనిపించే తరుణంలో
ఇప్పుడు ఈ క్షణం ఇలా...గమ్మత్తుగా!
మనసు మెళిపెడుతున్న భాదగా ఏంచేయలేక
గతించిన కాలానికి కొనసాగింపుగా! జీవితాన్ని జీవించలేక..
వెళ్ళిపోయేరోజు దగ్గరలో ఉంది ...ఎదురు చూస్తున్నా ఎప్పుడొస్తుందా ఆ రోజని
Labels:
కవితలు