Monday, November 7, 2011
అదే నా మనసు నిండి పొయింది బాధలో నీ లేమితొ ఈనాడు,
నీవు నన్ను మర్చిపోయావని తెలిసిన క్షనం నుంచి
కనుల సరస్సులో ప్రేమ ఇంకా ఇంకిపోకుంది,
హృదయ స్పందనలో ప్రేమ ఇంకా ఆగిపోకుంది,
మది గదిలో ప్రేమ ఇంకా ఖాళీకాకుంది,
ఆలోచనని ఆణిచిపెట్టినా, జ్ఞాపకం కరిగిపోనంటుంది.
నీ ఊహలేని క్షణాన్ని కాలం దరిచేరనీయనంది.
ఇంక ఎలా మరి నిన్ను మరిచిపోయేది....?
ఒక్క మాటలో చెప్పనా నా జీవితంలో ప్రతిరోజు....
నిదుర కరిగిన కనులకు మొదటి రూపం,....
రెప్పవాల్చే కనులలో చేరే చివరి అందం నీ ఆలోచనే.
నా బాధ
నిండి పొయింది నా మనసు నీ రూపంతో ఒకనాడు,
అదే నా మనసు నిండి పొయింది బాధలో నీ లేమితొ ఈనాడు,
కలలన్ని కధలయ్యయి, కన్నిళ్లే వరమయ్యయి,
వెన్నెల సైతం కాల్చెస్తుంది నీ విరహ వేదన తొ,
ఆగదు నా హ్రుదయం ఈ క్షణం నీవు లేవని,
ఎదురు చూస్తుంది నీవు వచ్చె క్షణం కొసం............
Labels:
కవితలు