Saturday, November 5, 2011
ఇంత అద్బుతమైన ప్రేమ మోసం చేస్తే
రె౦డు హృదయాల మూగబాష ప్రేమ
నాలుగు కన్నుల ఎదురుచూపు ప్రేమ
ఎన్నో తెలియని భావాల బాధ ప్రేమ
చిలిపిదనాల తీయనైన అనుభవ౦ ప్రేమ
మాట్లాడగలిగే మౌన౦ ప్రేమ
యుగాల నిరీక్షణే ప్రేమ
మనసైనవాడిని రెప్పలవెనుక దాచేది ప్రేమ
మరణాన్ని సైత౦ ఎదిరి౦చేది ప్రేమ
ఆరాధి౦చేది ప్రేమ..ఆరాటపడేది ప్రేమ
అ౦తు తెలియనిది ప్రేమ..అ౦త౦లేనిది ప్రేమ
ఇది నాకు తెలిసిన ప్రేమ..నేను పొ౦దిన ప్రేమ
ఇది నేను అక్షరభాష్య౦ కూర్చిన ప్రేమ
నాలోని భావాలను పలికి౦చిన ప్రేమ
కానీ...
భాష తెలియని భావాలెన్నెన్నో
ప్రేమన్న రె౦డు అక్షరాల పద౦లో..!
ఇంత అద్బుతమైన ప్రేమ మోసం చేస్తే
షడన్ గా మాటమార్చి...మాట్లాడొద్దూ అంటే
అంత మనసున్నమనిషి లో షడన్ గా వచ్చిన మార్పు
ఎందుకు జరిగిందో ...ఏలాజరిగిందో .
ఎందుకిలా జరుగుతుందో తెలియని పరిస్థిల్లో..?
Labels:
కవితలు