. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, November 28, 2011

“నేనిలాగే జీవించదలుచుకున్నాను..” ...? అయితే ఏంటంట

“నేనిలాగే జీవించదలుచుకున్నాను..” అయితే ఏంటంట అని ఎప్పుడైనా మనం బల్లగుద్ది చెప్పగలమా? మన జీవనశైలిని సమర్థించుకోవడానికి చాలాసార్లు మనం “యెస్.. నేనింతే” అని ఢాంబికాలు పోతుంటాం. కానీ మనసులో మన నిర్ణయంపై మనకు నమ్మకముందా? మన నిర్ణయాలు అస్థిరమైనవి.. బయటకు ప్రకటింపజేసుకోవడానికే తప్ప మనసులో వాటికి బలమైన పునాదులు ఉండవు.ఆ నిర్నయాలమీద నిలబడగలవా...? బయపడుతూ సమాజంలో అతని వల్ల ఎలాంటీ ప్రాబ్లలు వస్తాయో ఎక్కడ పరువు పోతుందో అని ఆలోచిస్తూ మనసు చంపుకొని బయపడుతూ జీవించడంలో నీమనస్సాక్షిని వప్పించగలవా..? నిజాన్ని నిజంలా ఒప్పుకోలేనప్పుడు..?

“నేనింతే..” అని చెప్తుంటాం కానీ ఆ “నేనింతే..” ధోరణినీ సమ్మతింపజేసుకోవడానికి మనుషుల వైపు చూస్తుంటాం. అంటే పరోక్షంగా అందరూ ఒప్పుకుంటే “నేనింతే..”ని చెల్లుబాటు చేసుకుంటాం. అందరూ తిరస్కరిస్తే దారి మళ్లించుకోజూస్తాం.

మనం ఓ లక్ష్యం నిర్దేశించుకుంటాం.. దాన్ని సందర్భమొచ్చినప్పుడల్లా వల్లెవేస్తుంటాం. వినేవారి నుండి మిశ్రమ స్పందనలు వస్తాయి. ఆ స్పందనలు మన లక్ష్యంపై అనుమానాలు పెంచుతాయి.. చిన్నచిన్నగా ఆ లక్ష్యం కాస్తా నీరుగారిపోయి.. కొన్నాళ్లకు.. “నేను ఫలానా పని చేద్దామనుకున్నాను.. కానీ పరిస్థితులు అనుకూలించలేదు..” అని అదే లక్ష్యాన్ని గొప్పగా చెప్పుకుంటూనే సంజాయిషీలు ఇచ్చుకునే స్థితికి దిగజారిపోతాం. లక్ష్యాలూ, సాధనలూ అంటే ఇదేదో విద్యార్థులను ఉద్దేశించి మాత్రమే రాస్తున్నది కాదు. ప్రతీ ఒక్కరి మనసులో ఎన్నో కలలు చిగురిస్తుంటాయి. అవి మరుక్షణంలోనే చిదిమిపోతాయి. కారణం మన అనుకున్నది మొండిగా చేయకపోవడమే.

మనం మనకు నచ్చినట్లు ఉంటామంటే అందరూ ఒప్పుకోరు. అందరూ ఒప్పుకోవాలని ఆశించడం అతి పెద్ద తప్పు. అంతెందుకు.. “నాలైఫ్ ష్టైల్ నాయిష్టం ఎదుటి వాళ్ళ మనస్సుతో నాకేంటీ నాకు నచ్చినట్టు నేనుంటా...?” అని నేను ఎక్కడ చెప్పినా,అందరూ నమ్మరు నీ మనస్సులో అసలు నిజాన్ని ఎంత చిత్తశుద్ధితో దానికి కట్టుబడి ఉన్నా కొంతమంది పెదవి విరుస్తుంటారు.. కొంతమంది బ్రతకడం తెలియదన్నట్లు వంకర నవ్వులు నవ్వుతుంటారు. వారు కోరుకున్నట్లే బ్రతకడం నా పాషన్ గా భావించి ఉంటే నేను ప్రతీ విషయంలో పెట్టే effortకి ఆ రకమైన ఫలితాలు లభించేవేమో! నేను రాస్తున్న పాయింట్ కి నా స్వంత విషయాన్ని ఓ ఉదాహరణగా చెప్పానే తప్ప ఎవరిపై నాకు కంప్లయింట్లు లేవు. ఇక్కడ ఎవర్నీ దోషులుగా నిలబెట్టలేం. ఎవరి ప్రయారిటీలు వారివి. మనమొక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత ఎవరి నుండి ఎలాంటి స్పందన వచ్చినా వెనక్కి తిరిగి చూడకూడదు.

లక్ష్యం కోసం ముందుకు సాగే క్రమంలో ప్రగతిని వెనక్కి తిరిగి బేరీజు వేసుకోవడం సబబు గానీ కోల్పోయినవేమిటా అని భూతద్దంలో చూడడం లక్ష్యాన్ని కుంగదీస్తుంది. కొన్ని సాధించాలంటే కొన్ని కోల్పోక తప్పదు. ఇది అందరం వినీ వినీ, చదివీ చదివీ ఆ ఫీల్ ని కూడా పోగొట్టుకున్న ప్రాధమిక సూత్రం. మరి అలాంటప్పుడు సాధించడానికా మనం లక్ష్యాలు నిర్దేశించుకునేది.. లేక కోల్పోయినవి గుర్తుతెచ్చుకుని ఉపసంహరించుకోవడానికా?

లక్ష్యం మనది.. కష్టం మనది.. సాధించేదీ, కోల్పోయేదీ మనం! లక్ష్యమనేది అంత స్వంతమైన విషయం అయినప్పుడు ఎవరి సమ్మతీ ఆశించకుండానే గుడ్డిగా కష్టపడదాం. వస్తే ఫలితం వస్తుంది, లేదా సంతృప్తి మిగులుతుంది. అంతే గానీ కాసేపు ఉత్సాహం, మరికాసేపు నిరుత్సాహంతో గొప్ప లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లడం సాధ్యం కాదు.