కలవరింతలో పలకరింతలా కావలి ఒక హృదయం
కనుపాప రూపమై నిలవమని అడగాలి చెలి నయనం
మాటల కూడికల రాతిరి కోడి కూతై తెరవాలి కోరికల కిటికీ
నా తలపుల తపనలు ఆ తలుపులు దాటి తను చేరి చేయాలి జాగారం
తెల్లవారి పెరగాలి కోరికల శేషం కలై కను చేరినా ప్రేమ వలై
నను చుట్టాలి ప్రియ పరువం అప్పు లేని వడ్డీలు అందించి
పొందాలి అధర మధురం పలుకులేరుగని ప్రతి క్షణం..