మదిని మెలిపెడుతున్న తన మాటల ప్రవాహం,
మతిని చెడగొడుతున్న తన జ్ఞాపక సమూహం,
దగ్గరై దూరమాయెను నా చిలిపి చకోరం...
మాటైనా చెప్పకుండెను నా మూగ మయూరం ......
తానులేని ఈ ఒంటరి పయనంలో,
మనసే ఎదురు తిరిగి ఈ కఠిన సమరంలో,
ప్రయత్నచేయలేక లేక నే ఓడిపోతున్న,
..నీ తలపులతో మళ్ళీ మళ్ళీ నే ఒంటరినౌతున్న,
నా కనులు కలవరపడుతుంటే,
కోరురుకున్న కోర్కెలు కనుమరుగవుతుంటే,
ఊపిరిసలపని ఊహలు ఊగిసలాడుతుంటే,
ఆ కనుల ముందు బంగారు భవిత చితికిపోతుంది.
ఆ చితికిన కోర్కెలనడుమ బతుకు చిద్రమౌతుంది..
ఆ చిద్రమైన ఊసులతోడి ఈ తనువు చితికి తరలిపోతుంది...