ఓడిపోయి, ఓడిపోయి, విసిగిపోయి
గెలుపు అనే మాటే మరచిపోయి....
అలసి సొలసి ఇల పయనిస్తూ, అడుగు అడుగునా మరనిస్తూ,
జీవనపోరాటం చేస్తున్న వేళ..
ఒటమిలో తోడుగా, చిరునవ్వుల జాడగా
నా వెనువెంటే వచ్చావు, నాకు నీ ప్రేమ పంచావు, గెలవాలనే తపన పెంచావు
నేడు ఇలా రొజు రొజుకీ, ఘడియ ఘడియకీ గెలుస్తూ ఉంటే,
ఏ గెలుపు లో నువ్వు లేవనే బాద తిరిగి నన్ను ఒంటరివాడిని చేసేసింది....
బ్రతకాలన్న ఆశ ఎప్పుడో చచ్చిపోయింది...?
ఇద్దరిలో నన్ను కాదన్నప్పుడే నేను చచ్చిపోయానురా..?
నేను నిజంకాదు అబద్దం కదా..నిజం నీదగ్గరే ఉంది...
నేను నిజం కాదు కాబట్టీ నీకు దూరంగా ఉన్నాకదా...?
నేను ఓడిపోయాను..గెలవలేను అని తెల్సింది..
గెలిచే హక్కుకూడా లేదని తెల్సింది..
తప్పు నీది కాదు .. నిన్ను నమ్మించలేని నాస్నేహానిది...
ఓడిపోయాను ..జీవితంలో గెలవలేనేమో..కదా...?