. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, September 17, 2011

నా నమ్మకం నీ మెత్తని ప్రేమకు తల బాదుకుని ఇప్పటికి మరణించి వుంటుంది!


విశ్వం విస్తరిస్తున్నట్టు అంతులేని నా ప్రేమని
రాలిపడిన ఉల్కలాంటి చిటికెడు ప్రేమతో కొలిచావు
ఇంతకాలం అదే గొప్ప అజ్ఞానంతో కొండంత వ్యక్తీకరించాను
ప్రాణం వీచిననా ప్రేమ మహావృక్షం ముందు
బోన్సాయ్‌లా తలపొగరు ఎగరేసావు.
ఎవర్ని అయినా నమ్మేస్తావు నన్ను తప్ప ఎందుకో
నీవెంత అవమానించినా మన్నిస్తావనే నమ్మకమెలా వచ్చిందో నాకు!
బహుశా...
నా నమ్మకం నీ మెత్తని ప్రేమకు తల బాదుకుని ఇప్పటికి మరణించి వుంటుంది!
ఎంతసేపూ నా గురించే...
ఇంకా నువ్వు నాకేదో చెయ్యలేదనే...
తెలివిగా ఆ నిందలేమీ వెయ్యకుండానే వేదించావు
ఒకడి పనికిమాలిన వెదవ తెలివంతా నన్ను ఏడిపించడానికే ఉపయోదించాడు...
నీమీద నమ్మకం లేదు అది నిరూ పించుకోవడానికి నా ప్రేమను బలి చేశాడు వెదవ...
సిగ్గులేకుండా అనేకమాటలు నన్నూనిన్నూ అన్నాడు
నన్నేంత క్షోభపెట్టినా నీవు వినిఊరుకున్నావు..అప్పుడు నామీద ఉన్న ప్రేమ ఎమైంది
బహుశా...ప్రేమను గుర్తించలేక అప్పటికే నీమనసులో‘నేను’ మరణించి వుంటాను!
వాడి అసమర్థత... వాడి స్వార్థం...
వాడు నీకేమీ ఇవ్వలేనితనం... వాడి చేతకాని దోషం...
అన్నీ కప్పిపుచ్చుకోవటానకే నన్ను ఆడిపోసుకోవటాలు...
దూషించటాలు... ద్వేషించటాలు...
దోషం తెలిసేకొద్దీ
దోషిని నన్ను చేసి ఇంకా నామీద కర్కశమెందుకో వాడికి?
ప్రాణంగా ప్రేమించిన నన్ను నీవు ద్వేషించేలా చేశాడు
నాది ప్రేమకాదని...నిరూపించడానికి ఎన్నో డ్రామాలాడాడు
ఏది ప్రేమో నిరూపణయ్యాక మిగిలేది నీకు పశ్చాతాపమే..
అప్పుడు పుట్టింది చూడు ద్రవజ్వాల అన్న కల్మషాల్ని కర్కశాల్ని కాల్చేస్తూ...
అదే కన్నీటితో వేడుకుంటున్నాను నిజం తెల్సుకో..
ఇప్పట్లో నిజం తెల్సుకుంటావని ఆశ చచ్చిపోయింది..
అవకాశం చేజారి పోతుందని గుర్తుపెట్టుకో..
అన్నీ తెల్సుకొని చూసే సరికి ఆకాశంలో చుక్కల్లో కల్సిపోతాను..