. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, September 12, 2011

అందుకే నా ప్రేమనావ లో నిన్ను తీరాన్ని చేర్చాలని తపన పడుతున్నాను


నిన్ను శుభోదయం అని పలకరించే పదిమంది లో నేనూ ఒకడిని కావడం నాకిష్టంలేదు
అందుకే భానుని లేత తొలి కిరణం లా మారి నిన్ను చేరాలనుకుంటున్నాను

వేల నక్షత్రాలలో ఒకటిగా చేరి నీ నిశిరాత్రి ని నింపడం నాకు నచ్చలేదు
అందుకే నీ మనసులో వెన్నెల వెలుగు లా కురవాలనుకుంటున్నాను

సమస్యలసంద్రంలో నువ్వు ఉన్న సమయాన నిన్ను ఒడ్డుకునెట్టే వంద అలల్లో ఒకటి కావడం నా అభిమతం కాదు
అందుకే నా ప్రేమనావ లో నిన్ను తీరాన్ని చేర్చాలని తపన పడుతున్నాను

నిన్ను ఆహ్లాదపరిచే వేల వర్ణాల్లో నేను ఒకటి కావడం నా కోరిక కాదు
అందుకే నీ మనసు కాన్వాస్ పై చిత్రమైన వర్ణాల చిత్ర పటమై నేను నిలవాలనుకుంటున్నాను

నువ్వు చూసే వేల రూపాల్లో నాది ఒకటి కావడం నాకు తృప్తి నివ్వదు
అందుకే అద్దం లో నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు నీ ప్రతిబింబం నేనవ్వాలనుకుంటున్నాను

నేను నీకెంత ప్రత్యేకతనిస్తానో
నీక్కూడా నేనంత ప్రత్యేకం కావాలనుకుంటున్నాను
ఒకప్పుడు నీవే అన్నావు నేనంటే ప్రత్యేకం అని కాని..?
అందరితో మాట్లాడుతున్నావు నాతో తప్ప కదా...?



ఈ భావాలకి నువ్వు పెట్టే పేరు అసూయ అయినా ఆనందమే.....
నా అభిమానానికి నువ్విచ్చే బిరుదు స్వార్ధమైనా సంతోషమే................