Friday, September 2, 2011
వెల్లువై తీరాన్నిచేరి అలసిపోయిన కడలి కెరటానివో...
మంచి అనే ఉద్యానవనంలో వికసించిన కుసుమానివో..
మది అనే నదిలో ప్రవహించే అమౄతానివో..
మమత అనే అద్భుత అనుబంధానికి అంకురానివో..
మనసు పాడే సుమధుర గీతానికి పల్లవివో...
మనసు అనే వేదికపై వయసు వేసే నౄత్యానివో
వయసు వేసే నౄత్యానికే ఓ చక్కటి అభినయానివో
జ్ఞాపకమను వేదికపై చెలరేగిన అలల తాకిడివో
వెల్లువై తీరాన్నిచేరి అలసిపోయిన కడలి కెరటానివో...
ఊహ అనే మహాసముద్రమో ఎగసిపడుతున్న అల నీవో
స్వప్నమను నందన వనంలో నేను కట్టుకున్న సౌధానివో
మమకార మను పూతోటలో సుగంధాలు వెదజల్లే పారిజాతానివో
అలంకారం అను హారంలో పొందికగా ఒదిగిపొయిన మణిపూసవో
చెలిమి అనీ పేరుతో నీవు కోరే చేయూతకునేను ఎల్లపుడూ సిద్ధం
మైత్రి అనే మరోపేరుతోనైనా దరికిచేరితేకలిసి పయనిద్ధాం
నిర్వచనం లేని ప్రేమకి కుడా ఓ అందమైనఅర్ధాన్నందించిన ఓ స్నేహమా
అంతేలేని నీ స్వరాజ్యంలో నాకు కూడాకాసింత చోటు కల్పించవూ....
Labels:
కవితలు