Friday, September 2, 2011
అంధనం ఎక్కిన నేను వెనుతిరిగి చూస్తే నీవు కానరావే
జీవన వాగులో దిశ లేకుండా కొట్టుకుపోతున్న దశలో
చేయూతనిచ్చి జీవన పయనంలో తోడయ్యావు
నా ఆశయాలు అడవిలో కాచిన వెన్నేలవుతుంటే
నీ వాణితో నాలో సంకల్ప కణాలనే రాజేసావు
రాళ్ళ బాటలో కుసుమానివై నీపాదం కింద నలిగాను
పూల బాటలో పుష్పగుచ్చానివై ప్రశంసిచ్చావు
అందని అధిరోహలికే ప్రతి అడుగులో మెట్టువై ఎక్కించావు
అంధనం ఎక్కిన నేను వెనుతిరిగి చూస్తే నీవు కానరావే
ఆవేదనను ఆధ్యంగా ,
ప్రేమనే జ్యోతిగా ,
ఆదిరోహం ఎక్కిన ప్రతి మెట్టు ఆనవాలుతో
నీకై అన్వేషణ సాగించాను ...
ప్రియా ... తరాసపడినావు
ఆశగా వెతికిన మనసుకి ఆవేదన మిగులుస్తూ
పిచ్చి నా మనసు గ్రహించనే లేదు
పయనం మద్యలో ఆగిన నీ అడుగుని
ఊహనైన నన్ను వీడవనే నమ్మకమేమో
మిగిలిన నా పయనంలో నువ్వు లేకున్నా ఉన్నట్లే అనిపించింది
ఆయినా నాకు తెలిలేదు సుమా ...
నా పై నీకు ఇంత మక్కువని..
అంత ప్రేమ ఒక్కసారి ఎలా మారిపోయింది..?
Labels:
కవితలు