అస్తమించని అశ్రువై , విశ్రమించని శత్రువై
కనుపాప చేసెను యుద్దమే.. కనిపించలేక ఫలితమే ...
భీకర చీకటికి రాజే తానో
రేరాజు రాని రాతిరికి భానిసే తానో
తెలియని గగనం చేస్తే మౌన పోరాటం
చేరేనా అది వైకుంటం.. అని
"కనుపాప చేసే "
ఓటమిని గెలిచిన గెలుపే తానో
గెలుపునే మరచిన ఓటమి తానో
సమరం మధ్యన సమస్యలా నిలిచినో తెలియక
"కనుపాప చేసే "
అరజ్ఞానం తోడ రణరంగం ఒడిని చేరి
మరలిరాని నిదుర పోయిన అభిమన్యుడే అవుతాడో
హవ్యా వాహనుడి ఆకలి తీర్చిన అర్జునుడై వెలుగుతాడో
ఎరుగక, చేసే యుద్ధం కనిపించక .............